.webp)
మాస్ జాతర షోతో ప్రతీ వారం ఆడియన్స్ ఫుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. అందులో కంటెస్టెంట్స్ కంటే నవదీప్ కామెడీతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక జ్ఞానేశ్వర్ తో నవదీప్ పెగ్గు మీద పెగ్గేస్తున్నాడు. జ్ఞానేశ్వర్ కళ్ళు తిరిగి కిందపోయాడు. వెంటనే నవదీప్ చేతిలో బోటిల్ పట్టుకున్నాడు. "వ్వాహ్ నవదీప్ అన్న వ్వాహ్ పెగ్గేద్దామన్నా వస్తావా అన్నా" అని అడిగాడు. ఇక నవదీప్ కూడా వెళ్లి తన బోటిల్ లోది జ్ఞానేశ్వర్ బోటిల్ లోకి ఒంపాడు.
చీర్స్ కొట్టుకుని తాగారు. బాక్గ్రౌండ్ లో "మందు బాబులం మేము మందు బాబులం" అనే సాంగ్ పెట్టారు. "అన్నా బాగా స్ట్రాంగ్ గా ఉంది కొంచెం నీళ్లు కలుపుకో అన్నా.. నా పేరు చెప్పా అన్నా వైన్స్ లా గుర్తుందా అన్నా" అన్నాడు. "మర్సిపోయినా" అని నవదీప్ అనేసరికి "బాగా గుమ్ముగా తాగినవ్ అందుకే మర్సిపోయినవ్ " అన్నాడు జ్ఞానేశ్వర్. "కరివేపాకు" అన్నాడు. దాంతో నవదీప్ తెగ నవ్వేసాడు. ఇంతలో జ్ఞానేశ్వర్ ముగ్గులేస్తూ ఉన్నాడు. బిందు మాధవి అతన్ని చూసి కరేపాక్ అంది దాంతో జ్ఞానేశ్వర్ నేను ఆఫీస్ కి వెళ్ళాలి అని వాళ్ళ ఆవిడకి చెప్పి వెళ్ళాడు.
ఇక జ్ఞానేశ్వర్ భార్య అమరదీప్ కి కౌంటర్ ఇచ్చింది. "గీ అమరదీప్ అన్న ఇచ్చిన మందు వల్ల ఆడపిల్ల గావాల్నా, మగపిల్లాడు గావాల్నా అని ముద్దుగా అడిగిండు. వీళ్ళిద్దరినీ కలిపి ఒక ప్రోడక్ట్ లా కలిపిచ్చిండు " అని ఆమె అనే అనేసరికి అమరదీప్ షాకై ఎం చెప్పాలో తెలీక నవ్వేసాడు. ఇక ఉదయం అంతా ఆడపిల్ల లెక్క ఉంటది రాత్రి నుంచి తెల్లారే వరకు మగపిల్లాడిలా ఉంటాడు అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు.






