
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -110 లో.....ప్రతాప్, నారాయణ ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తారు. నిన్న అంత ఒక దాని గురించి చెప్పాను కదా.. అది ఇప్పుడు ఈ రెసాట్ కి వచ్చిందని ప్రతాప్ చెప్తాడు. అది రక్తబంధం కదా సర్ అంత ఈజీగా వదిలిపోదని నారాయణ చెప్తాడు. ఆ తర్వాత నారాయణ, ప్రతాప్ ఇద్దరు కలిసి ఒక ఫోటో తీసుకుంటారు. ఈ ఫోన్ చిన్నది సర్ మా కోడలికి ఆ ఫోటో పంపించండి అని మహా నెంబర్ చెప్తాడు నారాయణ. దాంతో ఆ ఫోటోని మహాకి పంపిస్తాడు ప్రతాప్. ఆ ఫోటో చూసి మహా షాక్ అవుతుంది. మీ నాన్న, మా నాన్న కలిసి డ్రింక్ చేస్తున్నారని చక్రి వాళ్ళకి చెప్తుంది.
మా నాన్నకి మీ నాన్న తెలియదు కాబట్టి ఇలా డ్రింక్ చేస్తున్నారు.. లేదంటే అలా ఎందుకు చేస్తారు.. మేం వెళ్లి నాన్నని తీసుకొని వస్తామని మాధవ, కేశవ, కన్నా వెళ్తారు. వాళ్ళు వెళ్తుంటే తన ఫ్రెండ్ అయిన రెసాట్ ఓనర్ తో ఆది మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళని ఎందుకు రానిచ్చావ్ రా అని మాధవ వాళ్ళని ఉద్దేశించి ఆది అంటుంటే ఎవరిని రా అనేది అని ఆదిపై చెయ్ చేసుకుంటాడు కేశవ. అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. ఇంకా రావడం లేదని చక్రి, మహా వస్తారు. మహా వచ్చి గొడవని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఏంటి గొడవ జరుగుతుందని నారాయణ, ప్రతాప్ వస్తారు. వాడే నన్ను పొడిచింది అని ప్రతాప్ తో నారాయణ అనగానే అంటే నువ్వు ఆ డ్రైవర్ గాడి నాన్నవా అని ప్రతాప్ అంటాడు. అంటే మా కోడలు పిల్ల నాన్ననా నువ్వు ..... అంటే మనం వియ్యంకులం అని నారాయణ అంటాడు . ఎవడ్రా నువ్వు అని నారాయణని ప్రతాప్ కోప్పడతాడు. ఆ తర్వాత అందరు రూమ్ లోకి వెళ్లిపోతారు. పోయి అతనితోనే డ్రింక్ చెయ్యాలా అని అందరు నారాయణపై విరుచుకుపడతారు. ప్రతాప్, ఆదిని కేశవ వాళ్ళు తిడతారు. అప్పుడే మహా వస్తుంది. మహా రావడం చూసి మీ వాళ్ళని ఏదో తెలియక అన్నారని మాధవ అనగానే పర్లేదు పెద్ది ఉన్నదేగా అన్నారని మహా అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
మహా డల్ గా ఉందని తనని నవ్వించడానికి అందరు ప్లాన్ చేస్తారు. నారాయణ డ్యాన్స్ చేస్తాడు. మహా నవ్వుతుంది కేశవ, చక్రి డ్యాన్స్ చేస్తారు. మాధవ డైలాగ్ చెప్పి డ్యాన్స్ చేస్తాడు. అందరు డ్యాన్స్ చేస్తారు. అదంతా ప్రతాప్ చూస్తాడు. మరుసటిరోజు సారీ అండి మీ అన్నయ్యపై చెయ్ చేసుకున్నాను .. మీరు మా ఇంటిబిడ్డ.. మిమ్మల్ని అంటే ఊరుకోనని కేశవ అంటాడు. మీరు అనుకుంటున్నారు అలా అనుకోవడం లేదు.. వాళ్ళని ఏం అంటే నాకేంటని మహా అనగానే కేశవ హ్యాపీగా ఫీల్ అవుతాడు. తరువాయి భాగంలో పాపని మహా తీసుకొని వెళ్తుంది. పాప కన్పించడం లేదని సీసటీవీలో చూస్తారు. అందులో పాపని కన్నా గదిలోకి తీసుకొని వెళ్ళినట్లు ఉంటుంది. దాంతో పాప ఎక్కడ అని కన్నాని ఆది వాళ్ళు కొట్టబోతారు. అప్పుడే మహా వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

