ENGLISH | TELUGU  
Home  » TV News

Krishna Mukunda Murari : తనతో దూరంగా ఉండటం మంచిది.. నట్టింట్లో మోకాళ్లపై అలా!

on Apr 24, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-453.. మీరా విషప్రయోగం ఫలించడం.. కృష్ణ కడుపునొప్పితో హాస్పిటల్ కి వెళ్ళడం.. డాక్టర్ పరిమళ కృష్ణకి గర్భసంచి తీసేయాలని చెప్పడంతో ఈ సీరియల్ ఆసక్తిగా సాగుతోంది. మరోవైపు మురారి ఒక్కడే తనలో తానే నిజం దాచుకొని కుమిలిపోతుంటాడు. ఇక తనలోని ఆవేదనను చెప్పుకోవడానికి దేవుడు దగ్గర దీపం వెలిగించి దన్నం పెట్టుకుంటాడు. అది చూసిన మీరా.. బిడ్డలు పుట్టరని తెలిసి దేవుడికి మొక్కుకోవడానికి వచ్చినట్లున్నాడు. ఇదే సరైన సమయమని మీరా అనుకుంటుంది. తనకి ఎదురుగా వెళ్లి.. మీకేం కష్టం మురారి గారు.. ఎందుకు దేవుడికి పూజ చేస్తున్నారంటుంది. అబ్బే ఏం లేదండి.. ఊరికే ఇలా వచ్చాను.. మీరు దన్నం పెట్టుకోవడానికి వచ్చినట్లున్నారు కదా మీరు కానివ్వండంటూ మురారి వెళ్తుంటాడు.

అవును మురారి గారు.. నేను మాత్రం దేవుడికి మొరపెట్టుకోవడానికే వచ్చాను. నా స్నేహితురాలికి క్యాన్సర్. ఆ విషయం ఆమెకు తెలియదు. తెలిసిన నేను.. తనని కలుస్తూ ఉంటే.. ఎక్కడ నిజం చెప్పేస్తానో అని కలవడం మానేశాను. తనను దూరం పెట్టేశాను. నిజం తెలియకపోతే నాలుగు రోజులు ఎక్కువ బతుకుందని ఆశ.. తనకోసం దన్నం పెట్టుకుందామని దేవుడి దగ్గరకు వచ్చానంటూ మురారి మనసులో మీరా ఓ ఆలోచనను కలిగిస్తుంది. ఈ మీరా కూడా ఇంచుమించు నా పరిస్థితిలోనే ఉంది.. తను అన్నట్లే కృష్ణకు నేను ఈ నిజాన్ని చెప్పకుండా ఉండాలంటే తనకు నేను దూరంగా ఉండటమే మంచిదని మురారి ఫిక్స్ అవుతాడు. ఇక కృష్ణ దగ్గరకు వచ్చిన మురారి.. తను ఎంత ప్రేమగా మాట్లాడిన పట్టనట్లుగా, దూరం పెట్టినట్లుగా మాట్లాడేస్తుంటాడు. ఇక మరోవైపు మురారీ.. పరిమళ దగ్గరకు బయల్దేర్తాడు. అది అలా ఉండగా.. భవాని దగ్గరకు వెళ్లిన రేవతి.. అక్కా ఆదర్శ్ మళ్లీ నా దగ్గరకు వచ్చి మీరాతో తన పెళ్లి విషయం అడగమన్నాడు. ఏం ఆలోచించారో చెప్పండి అక్క అని అంటుంది. ఏంటి ఆలోచించేది. వాడు కృష్ణ మీద కోపంగా ఎందుకు ఉంటున్నాడో తెలియదు. పైగా మీరాని ఒప్పించి పెళ్లి చేయడం అయ్యేపని కాదు కదా?..అసలు మీరా మనసులో ఏముందో తెలియదు కదా.. ఆలోచిద్దాం, ముందు మాత్రం కృష్ణ విషయంలో ఆదర్శ్ ఎందుకు కోపంగా ఉన్నాడో తెలియాలి.. అప్పటి దాకా ఏ నిర్ణయం తీసుకోవద్దని రేవతితో భవాని చెప్పి పంపిస్తుంది. ఇక డాక్టర్ పరిమళను కలిసిన మురారి.. కృష్ణకు నిజం చెప్పడం నావల్ల కావడం లేదు పరిమళ అని మురారి అంటాడు. 

మురారి బాగా ఆలోచించు.. కృష్ణకు తెలియకుండా ఎంతకాలం దాస్తావ్? చెప్పేస్తే ఆ గాయం నెమ్మదిగా మానుతుంది కదా.. ఆలోచించు.. వారం రోజుల్లో నేను అమెరికా వెళ్లే పని ఉంది. నువ్వు త్వరగా కృష్ణకు చెబితే ఆపరేషన్ చేసే వెళ్లిపోతానంటుంది‌. పరిమిళ అలా చెప్పడంతో.. మురారి బాధగా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. ఇక తరువాయి భాగంలో మీరా ముందు ఆదర్శ్ మోకాళ్లపై కూర్చుని పువ్వులు ఇస్తూ.. ఐ లవ్ యూ ముకుందా.. నీకు ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందామంటూ ప్రపోజ్ చేస్తాడు. దాంతో మీరా షాక్ అవుతుంది. మరోవైపు అది చూసిన కృష్ణ, మురారీ మరింత షాక్ అవుతారు. ఆదర్శ్ ముందుకు కృష్ణ వచ్చి.. ఆదర్శ్ చేతిలోని పువ్వుల్ని తను లాక్కోగా ఆదర్శ్ కోపంగా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.