Home

»

Tv News

Karthika Deepam2 :కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన శివన్నారాయణ ఫ్యామిలీ.. ఎస్ఐ ఫ్రెండ్ ఎంట్రీ!

Sep 20, 2026 9:35AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-783లో.. శివన్నారాయణ కుటుంబం మొత్తం రోడ్డున పడటంతో వారి పరిస్థితి చూసి కార్తీక్, దీపలు బాధపడుతూ ఎవరికీ తెలియకుండా వాళ్లకు పులిహోర, దద్దోజనం అందిస్తూ ఆకలి తీరుస్తుంటారు. మరోవైపు జ్యోత్స్నను వెతుక్కుంటూ సూరజ్ వస్తాడు. సూరజ్‌ని చూసిన జ్యోత్స్న కన్నీళ్లు పెట్టుకుంటూ అనాథ అని మా ఇంట్లోకి వచ్చి మాకు తీరని అన్యాయం చేశావు కదా.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు.. అసలు ఎందుకు వచ్చావని అడుగుతుంది. మీరు మాకు చేసిన అన్యాయం కంటే ఇదేం పెద్దది కాదని సూరజ్ అంటాడు. మరి ఎందుకొచ్చావని జ్యోత్స్న అడగడంతో సూరజ్ తన దగ్గర ఉన్న ఫోన్‌ను తీసి నాకు ఏది ఉంచుకోవడం అలవాటు లేదు.. తిరిగి ఇవ్వడానికి వచ్చానని చెప్పి ఫోన్ ఆమెకు ఇస్తాడు. ఇది కూడా మీ అమ్మకే ఇచ్చేయమని చెప్పాను కదా అని జ్యోత్స్న అంటే ఇది ఇప్పుడు నీకు చాలా అవసరం.. ఉంచుకోమని చెప్పి సూరజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అటు గుడిలో కూర్చున్న దీప, కార్తీక్‌లు శివన్నారాయణ కుటుంబం గురించి బాధపడుతుంటారు. వాళ్లను అంతంత మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోయాను బావా.. విన్న మనకే ఇంత బాధగా ఉంటే.. ఆ మాటలు పడిన వాళ్లకెంత బాధగా ఉంటుందోనని దీప బాధపడుతుంది. ఇది కూడా మాలిని పనే. ఎంత ధర్మకర్త అయితే మాత్రం ఇలా మాట్లాడతాడా.. అతను మాలిని మనిషే. మొత్తం లాక్కున్నా కూడా ఆమె వదిలిపెట్టదు. మాటలతో మనుషుల్ని మానసికంగా చంపేయాలని చూస్తుంది. ఇదే కొనసాగితే తాత బతకడు దీపా.. తాతకి పరువే ప్రాణం. ఈరోజు తన పరువు పోయిందని, మర్యాద పోయిందని కుమిలిపోతున్నాడని కార్తీక్  చెప్తాడు.

ఇక శివన్నారాయణ కుటుంబాన్ని ఎలాగైనా తన ఇంటికి తీసుకెళ్లాలని కార్తీక్ ఒక ప్లాన్ వేస్తాడు. కొంతమంది వ్యక్తులను తీసుకుని వాళ్ల దగ్గరకు వెళ్లి ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి కానీ.. ఇలా ఇల్లు వదిలి రోడ్డు మీదకు వచ్చేస్తారా.. అల్లుడు పట్టించుకోవడం లేదు.. బయటకు గెంటేశాడని అందరు అనుకోరా అంటూ పెద్దమనుషుల ముందు జరిగిన విషయాన్ని చెప్తాడు. వాళ్లు కూడా కార్తీక్‌కు మద్దతుగా మాట్లాడుతూ వీళ్లంతా మీ రక్త సంబంధం అయితే ఇలా రోడ్డుపై వదిలేస్తారా అని శివన్నారాయణను ప్రశ్నిస్తారు. ఆస్తులన్నీ లాక్కున్నారు.. నా ఇంటికి రమ్మంటే కూడా రావడం లేదంటూ కార్తీక్ నటిస్తాడు. ఇలాంటి అల్లుడు దొరకడం అదృష్టం.. అతనితో వెళ్లండి అంటూ వాళ్లు నచ్చజెప్పినా శివన్నారాయణ మాత్రం “నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నేను మీతో రాలేనని చెప్తాడు. దేవుడా.. మాకు నువ్వే సాయం చేయాలని కార్తీక్ అనగానే పోలీసులు అక్కడికి వస్తారు. ఎస్ఐ .. ఏంటీ రోడ్డుపై ఈ న్యూసెన్స్ అని అడిగి మనవడు పిలుస్తుంటే ఇంటికి వెళ్లకుండా ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారని శివన్నారాయణను ప్రశ్నిస్తాడు. వెళ్లడం, వెళ్లకపోవడం మా ఇష్టమని శివన్నారాయణ చెప్పడంతో ఇలా గుంపులుగా రోడ్లపై తిరిగితే కేసులు పెట్టాల్సి ఉంటుందని ఎస్ ఐ అంటాడు. ఏదైనా ఉంటే ఇంటికి వెళ్లి మాట్లాడుకోండి.. లేదంటే స్టేషన్‌కు రండి అని గట్టిగా చెప్తాడు. దాంతో పరిస్థితి తప్పదని అర్థం చేసుకున్న దశరథ .. నాన్నా.. పరిస్థితి బాలేదు.. మనకు వేరే ఆప్షన్ లేదని చెప్పడంతో, దీప కూడా జ్యోత్స్న, సుమిత్ర, పారిజాతాలను నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్తుంది. వాళ్లతో పాటు ఎస్ఐ కూడా ఇంటికి రావడంతో కార్తీక్ అందరిని పరిచయం చేస్తాడు. సిటీలో దొంగల బ్యాచ్‌లు తిరుగుతున్నాయి. వీళ్లు దొంగలు కాకపోయినా వీళ్లకు ప్రమాదం ఉండొచ్చు. వీళ్లు మళ్లీ రోడ్డుపై కనిపిస్తే మాత్రం మిమ్మల్ని కూడా వదలనంటూ కార్తీక్, శ్రీధర్‌లను హెచ్చరిస్తాడు.

ఆ తర్వాత ఎస్ఐ పేరు ఏంటని కార్తీక్ అడగడంతో అతను కార్తీక్‌ను పక్కకు తీసుకెళ్లి.. ఏరా.. నీకు నా పేరు ఏంటో తెలియదా అని సరదాగా అడుగుతాడు. అప్పుడు కార్తీక్‌కు అతను తన పాత స్నేహితుడని తెలుస్తుంది. సమయానికి వచ్చి హెల్ప్ చేశావ్.. థాంక్స్ రా అని కార్తీక్ చెప్పగా నాకు థాంక్స్ చెప్తావేంట్రా.. మనం ఫ్రెండ్స్‌రా. వారం క్రితమే నాకు ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయిందని అతను చెప్తాడు. అంతేకాదు వాళ్లు మీ అమ్మమ్మ గారి ఫ్యామిలీనే కదా.. వాళ్లతో నీకు ప్రాబ్లమ్ ఏంటని అడగడంతో కార్తీక్ మొత్తం విషయం చెప్తాడు. జ్యోత్స్న పెళ్లి ఆగిపోయింది. ఆ పెళ్లి కొడుకుని తీసుకొచ్చింది మేమే కావడంతో ఆ నేరం కూడా మాపైనే పడిందని అంటాడు. వాడెవడో చెప్పు.. తీసుకొచ్చి లోపలేస్తానని ఎస్ఐ అనగా వాడెవడో కాదు.. మా మేనత్త కొడుకే అని కార్తీక్ చెప్తాడు. సొంతవాళ్లేనా అని ఎస్ఐ అడగగా గోతులు తీసేది సొంతవాళ్లే కదా.. రాజులా బతికిన మా తాతని బికారిని చేశారు. ఆ సూరజ్‌ని నమ్మి మోసపోయాం. పెళ్లితో వదిలేయలేదు.. ఆస్తులు కూడా లాక్కున్నారు. ఇప్పుడు వీళ్ల బాధ్యత మొత్తం నాదే అని కార్తీక్ చెప్తాడు. ఎంత ఛీ కొట్టినా వాళ్లు నా ఫ్యామిలీనే కదా అని కార్తీక్ చెప్పడంతో మళ్లీ మీరంతా కలవాలని ఎస్ ఐ అంటాడు. ఆ  క్షణం కోసమే నేనూ ఎదురుచూస్తున్నా.. ఓపిగ్గా ఎదురు చూస్తే కాలమే అవకాశం ఇస్తుందని కార్తీక్ చెప్తాడు. దాంతో ఎస్ఐ.. నువ్వేం మారలేదు మచ్చా.. కారులో తిరిగినప్పుడు ఇలాగే ఉన్నావ్.. కాలినడకన ఉన్నప్పుడూ ఇలాగే ఉన్నావంటూ కార్తీక్‌ను మెచ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు మాలిని దగ్గరకు సూరజ్ ఆవేశంగా వెళ్లి.. శివన్నారాయణ గారి కుటుంబంతో సంతకాలు చేయించుకుని నీకు ఇచ్చిన డాక్యుమెంట్స్‌తో వాళ్ల తలరాతనే మార్చేశావు కదా.. వాళ్ల ఆస్తుల్ని ఎందుకు లాక్కున్నావు.. వాళ్లని ఎందుకు రోడ్డున పడేశావని నిలదీస్తాడు. ఈసారి అంటించుకున్నది రక్తపు మరకలు కాదు అమ్మా.. కన్నీళ్లని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

 

 

 

Karthika Deepam2 today episode 783, Star Maa Karthika Deepam2 September 20 episode,Karthika Deepam2, Karthik Deepa help Shivannarayana family, Karthika Deepam2 Suraj confronts Malini, Karthika Deepam2 SI entry twist

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com