Home

»

Tv News

Karthika Deepam2: జ్యోత్స్న ప్రేమకు ఫిదా అయిన సూరజ్.. అందరి ముందు మనసులో మాట చెప్పేసిందిగా!

Aug 20, 2026 9:36AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 Karthika Deepam2 .ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్  753 లో... జ్యోత్స్న తన ప్రేమను సూరజ్‌కి చెప్పినా అతను ఫోన్‌లో బిజీగా ఉండి సరిగ్గా పట్టించుకోలేదని దీప, కార్తీక్‌లతో బాధపడుతుంది. నేను ఒక మెట్టు దిగుతుంటే.. వాడు రెండు మెట్లు ఎక్కుతున్నాడు. నా ప్రేమ వాడికి ఎలా అర్థం చేయాలని అంటుంది. దాంతో కార్తీక్..నువ్వు లూసర్‌వా? ఫైటర్‌వా అని అడుగగా.. నేను ఫైటర్‌ని అని జ్యోత్స్న చెప్తుంది. అయితే ఫైట్ చేయి.. సూరజ్ బర్త్‌డే సందర్భంగా అందరి ముందు నీ మనసులో మాట చెప్పమని కార్తీక్ ధైర్యమిస్తాడు. సూరజ్ నా మనసులో నువ్వున్నావని రుజువు అడిగితే ఎలా  అని జ్యోత్స్న భయపడుతుంది.

 

సూరజ్ బర్త్‌డే కోసం జ్యోత్స్న ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుండగా.. కార్తీక్ దాసును కూడా ఇంటికి రప్పిస్తాడు. అందరూ మాట్లాడుకుంటుండగానే సూరజ్ అక్కడికి వస్తాడు. కేక్‌పై తన పేరు చూసి నా బర్త్‌డే అని మీ అందరికీ ఎలా తెలుసని ఆశ్చర్యపోతాడు. ఈ ఏర్పాట్లన్నీ జ్యోత్స్నే చేసిందని కార్తీక్ చెప్పడంతో సూరజ్ ఆమె వైపు చూస్తాడు. ఈరోజు నీకు బర్త్‌డే గిఫ్ట్ కూడా స్పెషల్. జ్యోత్స్నా.. నీ మనసులో మాట చెప్పమని కార్తీక్ అంటాడు. ధైర్యంగా చెప్పమని జ్యోత్స్నకు దీప సపోర్ట్ చేస్తుంది. అందరి ముందు జ్యోత్స్న సూరజ్ కళ్లలోకి చూస్తూ తన ప్రేమను బయటపెడుతుంది. నాకు మనుషులను పుస్తకం చదివినట్టు చదవడం రాదు. కానీ నీ గురించి నీకు తెలియకుండానే తెలుసుకున్నాను. సూరజ్.. నువ్వంటే నాకు ఇష్టం. నీతో కలిసి బతకగలననే నమ్మకం నాకు ఉంది. నా మనసు ఇంతకంటే బాగా చెప్పలేను.. అర్థమైందో లేదో నువ్వే చెప్పాలని హార్ట్ టచ్చింగ్‌గా ప్రపోజ్ చేస్తుంది జ్యోత్స్న. అయితే సూరజ్ కొంతసేపు మౌనంగా ఉండటంతో అందరిలో టెన్షన్ పెరుగుతుంది. చివరకు జ్యోత్స్న అంటే నాకు.. చాలా ఇష్టమని సూరజ్ చెప్పి అందరికి షాక్‌తో పాటు ఆనందాన్ని ఇస్తాడు.

 

జ్యోత్స్న మనసులో నేనే ఉన్నాను. తన మాటల్లోనే కాదు.. తన కళ్లలో కూడా నా మీదున్న ప్రేమ కనిపించింది. నేను కూడా తనని ఇష్టపడుతున్నాను.. తనతో కలిసి జీవించాలని ఆశపడుతున్నానని సూరజ్ చెప్పడంతో కుటుంబమంతా సంతోషంతో చప్పట్లు కొడుతుంది. శివన్నారాయణ ఎమోషనల్‌గా.. ఈరోజు సూరజ్ పుట్టినట్టు లేదు.. ఈ శివన్నారాయణ మళ్లీ పుట్టినట్టు ఉందని అంటాడు. ఆ తర్వాత సూరజ్ కేక్ కట్ చేసి, జ్యోత్స్నకు మొదటి కేక్ ముక్క తినిపించడానికి సంకోచిస్తాడు. దాంతో దీప.. ఇకపై నీ ప్రయారిటీ మొత్తం జ్యోత్స్ననే.. తినిపించమని చెప్పడంతో సూరజ్ ప్రేమగా జ్యోత్స్నకు కేక్ తినిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com