Karthika Deepam2:సుమిత్ర దశరథ్ ల మధ్య చిచ్చు రాజేసిన జ్యోత్స్న!
on Sep 4, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -453 లో..... సుమిత్ర తాళి తీసి కార్తీక్ దీప పెళ్లి ఆపాలని చూసిందని కాంచన బాధపడుతుంది. సుమిత్రని కాంచన తిడుతుంటే మా అమ్మని తిట్టకని దీప అంటుంది. ఒక్కరోజు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే నిజమైన తల్లిదండ్రులు కాలేరు. ఆ పిలుపులు ఆ గుమ్మం వరకేనని కాంచన అంటుంది.
ఆ తర్వాత ఎందుకు నా పరువు తీశావమ్మ అని సుమిత్రని శివన్నారాయణ అడుగుతాడు. నేను ముందు నుండే చెప్తున్నా ఆ దీపని ఎప్పటికి క్షమించలేను.. ఆ శుభకార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం నాకు ఇష్టం లేదని సుమిత్ర అంటుంది. నా చెల్లి అన్న మాటలు నిజమే మనసులో ఇంత విషం పెట్టుకున్నావా.. నా చెల్లికి నేను ఎలా ఎదురుపడాలని దశరథ్ బాధపడతాడు.ఆ తర్వాత కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. జ్యోత్స్న గురించి తెలియదు కాబట్టి సుమిత్ర అత్త తనకి సపోర్ట్ చేస్తుంది. లేదంటే అసలు క్షమించదని దీపతో కార్తీక్ అంటాడు. ఆ తర్వాత మరుసటి రోజు శివన్నారాయణ ఇంటికి దీప, కార్తీక్ వస్తారు. అందరు ఆశ్చర్యంగా చూస్తారు. ఏంటి మేమ్ పనికిరామని అనుకున్నారా అని కార్తీక్ అంటాడు. అత్త చేతిలో ఉన్న సామ్రాణి తీసుకొని నువ్వు వెయ్ దీప అని కార్తీక్ అనగానే సుమిత్ర కోపంగా వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత సుమిత్ర దగ్గరికి దశరథ్ వెళ్తాడు. తప్పు చేసినప్పుడు అలా ఎవరికి ఎదరుపడలేవని దశరథ్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న వచ్చి ప్రతిసారీ ఏదో పెద్దనేరం చేసినట్లు మమ్మీని అంటున్నారు. నీకు మమ్మీ కంటే అత్త అంటేనే ఇష్టమని జ్యోత్స్న అనగానే దశరథ్ తనపై చెయ్ ఎత్తుతాడు. ఆగండి.. అది అన్నదాంట్లో తప్పేముంది. నాకంటే మీ చెల్లి ఎక్కువ.. నా బాధ ఎప్పుడైనా పట్టించుకున్నారా పట్టించుకుంటే ఇలా మాట్లాడారు. ఈ ఇంట్లో నాకు సపోర్ట్ గా నా కూతురు తప్ప ఎవరు లేరని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



