Karthika Deepam2 : దురదృష్టం దీప కన్నీరై పొంగిన వేళ.. ప్రేమతో అమ్మని ఓదార్చిన శౌర్య!
on Mar 28, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2' . ఇది నవ వసంతం.. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -3 లో.. కుబేరుని అక్క అయిన అనసూయ దగ్గరికి.. దీప కూతురు శౌర్య వచ్చి నా మంచంలో ఎందుకు కూర్చొని ఉన్నావంటూ గొడవ చేస్తుంది. ఎంత దైర్యం నీకు.. ఇది నా తమ్ముడు ఇల్లు. నీ బాబు ఇల్లు అని శౌర్యపై అనసూయ కోప్పడుతుంది. ఆ తర్వాత దీప వచ్చి.. పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేదంటు శౌర్యని మందలిస్తుంది.
ఆ తర్వాత జాతరకి వెళదామని శౌర్యతో దీప చెప్తుంది. దీప డబ్బులు లెక్కిస్తుంటే అనసూయ వచ్చి లాగేసుకుంటుంది. నీ మొగుడు చేసిన ఊరన్ని అప్పులు పక్కన పెట్టి బిడ్డకి సైకిల్ కొంటుందట అంటూ కోప్పడుతుంది. ఈ డబ్బులతో అప్పు అయిన తీరుస్తాను. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి.. హాస్పటల్ కి అయిన వెళ్తానని అనసూయ డబ్బులు తీసుకుంటుంది. ఆ అప్పులు మీ కొడుకు చేసాడు. నేను కాదంటూ దీప ఏడుస్తుంది. ఇప్పుడు శౌర్యకి సైకిల్ ఎలా కొనాలని ఆలోచిస్తుంది. మరొకవైపు జ్యోత్స్న హైదరాబాద్ అందాల పోటీకీ రెడీ అవుతుంది. ఆ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక జ్యోత్స్న కి అసిస్టెంట్ లాగా పారిజాతం ఉంటుంది. నా కూతురు వాళ్ల అత్త మామలకు అన్ని విషయలు ముందే చెప్తుంది అంటు సుమిత్ర తన భర్త మురిసిపోతారు. శివన్నారాయణ దగ్గర ఆశీర్వాదం తీసుకొని జ్యోత్స్న బయలుదేరుతుంది.
మరొకవైపు శౌర్యని తీసుకొని దీప జాతరకి వెళ్తుంది. అక్కడ నాన్న ఎక్కడ అంటూ శౌర్య అడిగేసరికి దీప బాధపడుతుంది. ఆ తర్వాత మిస్ హైదరాబాద్ పోటీలలో జ్యోత్స్న ఫైనల్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత శౌర్యతో దీప ఇంటికి వెళ్తుంటే.. సైకిల్ పోటీ జరుగుతుంది నువ్వు అందులో పాల్గొను అమ్మ మనకు ప్రైజ్ వస్తుందని దీపని శౌర్య అడుగుతుంది. దానికి దీప సరే అంటుంది. పోటీలో అందరు మగవాళ్లే ఒక దీప మాత్రమే ఉండడంతో గరిట తిప్పుకునే దానివి నీకు ఎందుకు మగవాళ్లతో పోటీ అని అందరు హేళన చేస్తారు. వాళ్ళ మాటలకి సమాధానం చెప్పి దీప పోటీలో పాల్గొంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.
Also Read