Home

»

Tv News

Jayam Serial : బాక్సింగ్ వదిలి బట్టలు ఉతికిన గంగ.. పెద్దసారు సపోర్ట్!

Sep 2, 2026 3:47PM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ 'జయం'(Jayam) రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. మంగళవారం నాటి ఎపిసోడ్ -362 లో......స్పాన్సర్‌షిప్ పోగొట్టుకున్నావు.. ఇక నువ్వు ఏం బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తావ్. వాషింగ్ మెషిన్ పాడైంది. వెళ్లి అందరి బట్టలు ఉతుకు అంటూ గంగపై శకుంతల కోప్పడుతుంది.

దానికి గంగ.. నేను అన్ని పనులు చేయగలను, వాటితో పాటు బాక్సింగ్ కూడా చేస్తానంటూ ధైర్యంగా బదులిస్తుంది. ఆ తర్వాత గంగ బట్టలు ఉతుకుతుంటే శకుంతల, ఇషిక, వీరు కలిసి ఆమెను చూసి నవ్వుకుంటారు.అదంతా రంగా గమనిస్తాడు. వెంటనే రుద్రను తీసుకొచ్చి.. చూడు బావా, నువ్వు తనకు సపోర్ట్ చేయడం లేదని అందరు తనతో ఎలా ఆడుకుంటున్నారో అంటూ ఎమోషనల్ అవుతాడు.

అదే సమయంలో ప్రీతీ కూడా చూసి, పెద్ద సారుని తీసుకొని వస్తుంది. చూడండి నాన్నా.. గంగను ఎంత ఇబ్బంది పెడుతున్నారోనని చెప్తుంది.

విషయం చూసిన పెద్ద సారు శకుంతలపై కోప్పడతాడు. గంగ కూడా మీలాగే ఈ ఇంటికి వచ్చిన కోడలు. ఎందుకు తనతో ఇలాంటి పనులు చేయిస్తున్నారని నిలదీస్తాడు.దానికి శకుంతల.. వాషింగ్ మెషిన్ పాడైంది, అందుకే అని కవర్ చేస్తుంది. అయితే బాగు చేయించాలి. ఈ ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్లు లేరా.. నేను కూడా ఖాళీగానే ఉన్నానని పెద్దసారు అనగానే.. ఇదంతా మీరు సంపాదించిందని శకుంతల అంటుంది.

మరి నువ్వు ఖాళీగా ఉన్నావ్ అని పెద్దసారు అనగానే మీరు, నేను వేరు కాదని శకుంతల అంటుంది. మరి గంగ, రుద్ర ఎలా వేరు అవుతారు.. రుద్రనే కదా ఇంటిని చూసుకునేది. ఏం వీరు, ఇంట్లో ఉండి మీ అత్తయ్య చేస్తుంది తప్పు అని చెప్పలేదా అని పెద్దసారు ప్రశ్నిస్తాడు. అత్తయ్యకి తను స్పాన్సర్‌షిప్ పోగొట్టుకుందని కోపమని వీరు అంటాడు. దానికి పెద్ద సారు..‌స్పాన్సర్‌షిప్ మాత్రమే పోయింది, బాక్సింగ్ కాదు. గంగ నువ్వు అక్కడి నుంచి లే అంటూ గంగకు అండగా నిలబడతాడు. ఆ తర్వాత రంగా వచ్చి గంగ పిండేసిన చీరను చూస్తాడు. అది చిరిగి ఉంటుంది. కోపంతో అలా చేశావా అని ఇషిక అనగానే, లేదు, తన ధ్యాస అంతా బాక్సింగ్ మీదే ఉందని పెద్దసారు గంగను వెనకేసుకొస్తాడు.

మరి దీని తర్వాత ఏం జరిగింది.. గంగ తన బాక్సింగ్ కలను నెరవేర్చుకుంటుందా.. శకుంతల ఆటలు ఇంకెంత వరకు వెళ్తాయి.. తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..

 

 

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com