Home

»

Tv News

Jayam serial : ప్రమీలకు శకుంతల క్షమాపణ.. విశ్వ ఇంట్లో గంగ హల్‌చల్!

Apr 29, 2026

జీ తెలుగులో ప్రసారవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -255  లో..... ప్రమీలకి శకుంతల సారీ చెప్తుంది. దాంతో ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. నీపై చెయ్ చేసుకున్న నీకు సారీ అని శకుంతలకి పెద్దసారు చెప్తాడు. నువ్వు ఇలా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావ్.. నిన్ను ఎవరో ఇన్ ఫ్లూయెన్ చేస్తున్నారనిపిస్తుందని పెద్దసారు అంటాడు. మనుషులు చెప్పుడు మాటలు వినడం సహజమే కదండి అని శకుంతల అంటుంది. చెల్లి నువ్వు గ్రేట్.. నీ పాటతో ఇంట్లో అందరు ప్రశాంతంగా ఉండేలా చేసావని రంగా అంటాడు. నువ్వు ముందు వెళ్లి ప్రాక్టీస్ కి రెడీ అవ్వు అని రుద్ర చెప్తాడు. 

మరొకవైపు ఇషిక దగ్గరికి సూర్య, ఇందుమతి వెళ్తారు. అక్కకి ప్రమీల గురించి నెగెటివ్ గా చెప్పింది నువ్వే కదా అని అడుగుతారు. నేను కాదని ఇషిక అంటుంది. నాకు అంతా తెలుసు ఇంతక ముందు గంగ వదిన విషయంలో కూడా ఇలాగే చేసావని సూర్య కోప్పడతాడు. ఇంట్లో గొడవలకి కారణం అయ్యావని తెలిస్తే విడాకులు ఇచ్చి ఇంట్లో నుండి గెంటేస్తానని సూర్య వార్నింగ్ ఇస్తాడు. ఇంకొకసారి రిపీట్ అయితే ఇంట్లో పనులన్నీ నీ చేతే చేయిస్తానని ఇందుమతి వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు సుధాకి గంగ ఫోన్ చేస్తోంది. ఆ ఫోన్ విశ్వ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. మీరు ఎందుకు లిఫ్ట్ చేశారు అమ్మగారు ఎక్కడ అని అడుగుతుంది. దాంతో విశ్వకి కోపం వస్తుంది.

ఆ తర్వాత సుధా వచ్చి ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది. నువ్వు ఈ రోజు రావాలని చెప్తుంది. సరేనని గంగ చెప్పగానే నీకు ఇష్టమైన స్వీట్ చెప్పు అని సుధ అంటుంది. రసగుల్ల అని గంగ చెప్తుంది. అదంతా వింటుంటే విశ్వకి కోపం వస్తుంది. ఆ తర్వాత విశ్వ సర్ దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటున్నాను.. సుధా అమ్మ గారు రికమెండ్ చేశారని రుద్రతో గంగ చెప్తుంది. దానికి రుద్ర సరే అంటాడు. ఆ తర్వాత విశ్వ ఇంటి దగ్గర గంగని రుద్ర డ్రాప్ చేస్తాడు. ఇంట్లోకి రమ్మని గంగ ఫోర్స్ చెయ్యడంతో రుద్ర లోపలికి వెళ్తాడు. రుద్రతో సుధా ప్రేమగా మాట్లాడుతుంది. తరువాయి భాగంలో సుధా చేసిన స్వీట్ గంగ తీసుకొని వెళ్లి పెద్దసారుకి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com