
జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -253 లో.. సుధా, విశ్వ మాట్లాడుకుంటారు. మీరు గంగకి ట్రైనింగ్ ఇవ్వాలని విశ్వతో సుధా అంటుంది. నేను ఇవ్వనని విశ్వ అంటాడు. ఎందుకు ఇవ్వరు అని సుధా అడుగగా.. ఎలా ఇస్తానని అనుకున్నావ్.. ఒక ఆడది ఎలా ఉండాలో అలాగే ఉండాలి.. మగరాయుడిలా మారి ఇలాంటివి చేస్తానంటే నేనెలా ఒప్పుకుంటానని అనుకున్నావ్.. తను మీ అన్నయ్య కోడలు అని ఇలా చేయమంటున్నావా అని విశ్వ అడుగుతాడు.
లేదు తను నా మేనల్లుడి భార్య.. పైగా రుద్ర ట్రైనింగ్ కూడా ఇచ్చాడు.. మీరు ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని సుధా అడుగుతుంది. నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావ్.. ఇలా తెగిపోయిన బంధాలని నువ్వు మళ్ళీ కలుపుకుంటావనే నేను నీకు ఆ ఫ్యామిలీని దూరంగా ఉంచాను..నేను ట్రైనింగ్ ఇవ్వనని విశ్వ అంటాడు. మరి నాకు మాటిచ్చారు కదా.. ఆ మాట నిలబెట్టుకోండి అని సుధా అంటుంది. ఇక చేసేదేమీ లేక విశ్వ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అదే ఇంట్లో పనిచేసే లక్ష్మీ వచ్చి.. ఎందుకమ్మ గంగ గురించి అయ్యగారితో గొడవ అని అంటుంది. నేను గంగ కోసం ఎంత దూరం అయినా వెళ్తానని సుధా అంటుంది.
మరోవైపు ప్రమీల వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు కార్ లో శకుంతల వాళ్ళ ఇంటికి వస్తారు. ఎలా వెళదామని ప్రమీల వాళ్ళ అమ్మ అనగానే ఇంతదూరం వచ్చాక ఇంట్లోకి వెళ్ళకుంటే ఎలా అని ప్రమీల వాళ్ళ నాన్న అంటాడు. ఇక అప్పుడే కార్ దగ్గరికి రుద్ర వచ్చి లోపలికి రమ్మని పిలుస్తాడు. ఇక ప్రమీల వాళ్ళ అమ్మానాన్న ఇద్దరు ఇంటిలోపలికి వెళ్తారు. వాళ్ళని చూసి ప్రమీల ప్రేమగా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది.
ప్రమీల వాళ్ళ అమ్మానాన్నలని పెద్దసారు ఆప్యాయంగా పలకరిస్తుంటే శకుంత మాత్రం అవమానిస్తూ మాట్లాడుతుంది. ఇక ప్రమీల వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటాడు. నా కూతురు ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తనకి ఇక్కడ మానసిక ప్రశాంతత లేదు అని చెప్తుంటాడు. అసలేం మాట్లాడాలని అనుకుంటున్నారో చెప్పండి అని శకుంతల అడుగుతుంది.
సూటిగా విషయానికి వస్తాను.. తన భర్త చనిపోయాక ప్రమీలని తీసుకెళ్ళాలని అనుకుంటే మీరు వద్దని మీ కోడలు మీ దగ్గరే ఉండాలని పట్టుబట్టారు కానీ తను ఇక్కడ ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతుంది. తనకంటూ ఏ అచ్చటా ముచ్చటా తీరలేదని ప్రమీల వాళ్ళ నాన్న చెప్తాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామని అంటారు అడగగా.. నేను ప్రమీలని మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చానని ప్రమీల వాళ్ళ నాన్న అనగానే అందరు షాక్ అవుతారు.
మరి ప్రమీలని శకుంతల ఇంట్లో నుండి పంపిస్తుందా.. రుద్ర ఏం చేయనున్నాడు.. ఈ నిర్ణయానికి ప్రమీల ఒప్పుకుంటుందా.. అసలు ప్రమీల వాళ్ళ అమ్మనాన్నలు రావడానికి కారణం రుద్రనేనా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





