Home

»

Tv News

ఎక్కడికీ  పోదుమా  ఫ్లో ఉంది...రోజా అదిరిపోద్ది

Apr 28, 2026

జబర్దస్త్ నెక్స్ట్ వీక్ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  ఈ ప్రోమోలో ఒక్కో స్కిట్ ఒక్కో రేంజ్ లో పేలబోతున్నాయి.  డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ మాములుగా లేవు. ఇక జడ్జ్ నాగబాబు ఒక పర్సనల్ ఆఫర్ ని కూడా ఈ ప్రోమోలో ప్రకటించారు.  బెస్ట్ పెర్ఫార్మర్ కి , బెస్ట్ స్కిట్ కి చెరో 5 వేలు అని చెప్పారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి జడ్జెస్ ఇచ్చే గిఫ్ట్ . దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేయండి అన్నాడు. మరి బెస్ట్ జడ్జ్మెంట్ కి ఎం లేదా సర్ అంటూ పక్కనుంచి ఇంద్రజ అడిగింది. తర్వాత కంటెస్టెంట్స్ స్కిట్స్ మొదలుపెట్టారు. కొన్ని పంచ్ డైలాగ్స్ చూస్తే ..శాంతి స్వరూప్ స్కిట్ లో "దీపం ఆరిపోవడం వలన చాలా లాభాలున్నాయి" అన్నాడు.  

వెంటనే నాగబాబు "ఇది పెద్ద పతివ్రత" అంటూ కౌంటర్ ఇచ్చారు. "నాన్న గారు డైలీ తాగి వస్తుంటే తాగొద్దని ఎందుకు చెప్పలేదమ్మా " అంటూ ఫైమా శాంతి స్వరూప్ ని అడిగింది. "అలా చెప్తే నేను తాగిన విషయం తెలిసిపోతుంది కాదమ్మా " అన్నాడు. దాంతో నాగబాబు పడీపడీ నవ్వాడు. రాంప్రసాద్ స్కిట్ లో శ్రీదేవికి భర్తగా నటించాడు. "పెళ్ళై వన్ వీక్ అయ్యింది రష్మీ నాకు నా వైఫ్ కి అస్సలు పడట్లేదు " అన్నాడు. ఇంతలో శ్రీదేవి వచ్చి "రాత్రి బల్లి మీదపడింది నీ పక్కలో పడుకున్న చూడవే" అంది. "నా పక్కన బల్లె పడుకుంది అనుకున్న అందుకే లేగలేదు " అన్నాడు. "మీరు లేగుత్తారేమో ఏమన్నా చేత్తారేమో అని చెప్పి ఎంత ఆశగా చూశానో తెలుసా" అంది. "నేను లేస్తే ఎం చేయాలా అన్న టెన్షన్ తో నేను పడుకున్నా " అన్నాడు రాంప్రసాద్.

ఇక ఫైనల్ గా ధన్ రాజ్, రాకింగ్ రాకేష్, రోహిణి , పంచ్ ప్రసాద్  కలిసి స్కిట్ చేశారు.  "ఆ ప్రేమ జంట ఎక్కడున్నారు " అన్నాడు ప్రసాద్. "ఏ ప్రేమ జంట నేను చాలామంది ప్రేమ జంటలతో మాట్లాడుతూ ఉంటాను " అన్నాడు ధన్ రాజ్. "మూడు నెలల క్రితం నువ్వేం చేసావ్ " అన్నాడు ప్రసాద్. "ఇదే స్టేజి మీద 10 స్కిట్స్ చేసాను వెళ్ళిపోమన్నారు..వెళ్ళిపోయి  మళ్ళీ వచ్చా...సరే సెల్ తీసా ఏమేం చూద్దామో చెప్పండి " అన్నాడు ధన్ రాజ్. "నీ సినిమా పెట్టు ..నీ సినిమా నువ్వు చూడకపోతే ఇంకెవరు చూస్తారు " అంటూ లాగి ఒక్కటిచ్చాడు ప్రసాద్. ఇక స్కిట్స్ చూఆక  ఎక్కడికీ  పోదుమా జబర్దస్త్ కి ఫ్లో ఉంది  అన్నాడు నాగబాబు. ఇక నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. "వామ్మో జబర్దస్త్  మాములుగా ఉండదు బాస్ ఈస్ బాక్ నాగబాబు సార్..చమ్మక్ చంద్ర వస్తే ఇంకా సూపర్..పాత జబర్దస్త్ వచ్చినట్టు ఉంది. నవ్వుల నాగబాబు గారు రాకతో జబర్దస్త్ కి పాత  కళ వచ్చింది ,అలాగే రెబెల్ రోజా గారు కూడా వస్థే ఇంకా జబర్దస్త్ కి తిరుగు ఉండదు .రాజకీయాలు పక్కన పెట్టి ఇద్దరు జడ్జెస్ కలిస్తే  అదిరిపోతుంది షో" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com