Home

»

Tv News

జబర్దస్త్ లో స్కిట్ కి లక్ష రూపాయలు..రివీల్ చేసిన ధనరాజ్!

May 8, 2026 2:29PM

జబర్దస్త్ ఈ వారం  ఆడియన్స్ ని అలరించింది. అందులో ధనరాజ్ స్కిట్ ఎంటర్టైన్ చేసింది. ధనరాజ్ ఒక అమ్మాయిని లవ్ చేసాడు. ఐతే ధనరాజ్ పెళ్లి చేసుకుంటే వాళ్ళ బామ్మ చనిపోతుంది అందుకే తాను చనిపోయాక పెళ్లి చేసుకోమని చెప్తుంది. ఇదంతా కాదు అని ధనరాజ్ తన లవర్ ని అలాగే తన ఫ్రెండ్ ని పిలిచి వాళ్ళను ప్రేమ జంటగా నటించమని చెప్పాడు. అలాగే వాళ్ళను ఇంటికి తెచ్చి వాళ్ళ బామ్మకు పరిచయం చేసి పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇంట్లో ఉండేలా చేస్తాడు.

ఐతే ఆ నైట్ గడిచి తెల్లారేసరికి ధనరాజ్ గర్ల్ ఫ్రెండ్ అతని ఫ్రెండ్ కలిసి పెళ్లి చేసేసుకుంటారు. అది చూసి ధనరాజ్ షాక్ అయ్యాడు. "అసలు వాడు ఎలా నచ్చాడు" అని ధనరాజ్ ఆ అమ్మాయిని అడిగాడు. "మీరు నన్ను వదిలేసి నిద్రపోయారు. కానీ అతను మాత్రం నేను నిద్రపోతే ఎక్కడ తప్పు చేస్తానో అని రాత్రంతా కథలు చెప్తూ ఉన్నాడు" అని చెప్పింది. "ఎం కథలు చెప్పావురా" అని ధనరాజ్ అడిగాడు. "కృష్ణానగర్ కథలు చెప్పాను" అన్నాడు బాబు.

"వాయమ్మ ఆ కథలు చెప్తే ఎవరైనా ఏడుస్తారు"అన్నాడు ధనరాజ్ .  "మీకు జబర్దస్త్ లో పేమెంట్ ఎంత " అని ఆ గర్ల్ ఫ్రెండ్ బాబుని అడిగింది. "మూడుపూటలా భోజనం పెట్టి పెట్రోల్ ఖర్చులకు ఇస్తారు" అని బాబు చెప్పాడు. "మీకెంత ఇస్తారు" అని ధనరాజ్ ని అడిగింది. "నాకు ఒక స్కిట్ కి లక్ష రూపాయలు ఇస్తారు" అన్నాడు. "అతను చూడండి ఎంత నిజాయితీగా చెప్పాడో. మీరెంత గర్వంగా చెప్పారో" అంటూ సీరియస్ అయ్యింది కొత్తపెళ్ళికూతురు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com