.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1026 లో.. మదన్ అంటే తనకి ఇష్టమని ఇందుతో స్వాతి చెప్తుంది. నేను మదన్ ని పెళ్లి చేసుకొను.. నిన్ను మదన్ ని ఒక్కటి చేస్తానని స్వాతికి ఇందు మాటిస్తుంది.. ఆ తర్వాత రాజు దగ్గరికి లక్కీ వస్తాడు. నిన్న నువ్వు హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళావని లక్కీ అడుగుతాడు. రాజు సైలెంట్ గా ఉంటాడు. నువ్వు ఆ పది లక్షల గురించి దాస్తున్నావో.. మోస్తున్నానో నాకు తెలియదు కానీ పది లక్షలు ఐశ్వర్యకి ఇస్తే నా లైఫ్ సెటిల్ అని చెప్పేసి లక్కీ వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత రాజుకి ఇందు ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నారు అమ్మానాన్న ఎలా ఉన్నారని అడుగుతుంది. బాగున్నారు.. నువ్వు ఎందుకు కాల్ చేసావని రాజు అడుగుతాడు. నాకొక సమస్య వచ్చింది.. నువ్వే హెల్ప్ చెయ్యాలి.. రేపు నా పెళ్లి.. నువ్వే ఆపాలని ఇందు చెప్తుంది. నీకు డబ్బు ఇస్తానని ఇందు చెప్పగానే రాజు ఒప్పుకుంటాడు. ఏం చెయ్యాలో రాజుకు ఇందు చెప్తుంది. మరుసటిరోజు స్వాతి రెడీ అయి హాల్లోకి వస్తుంది. నువ్వు రెడీ అయ్యావ్ సరే కానీ ఇందు ఎక్కడ అని రేఖ అడుగుతుంది. అప్పుడే ఇందు రెడీ అయి వస్తుంది. ఇప్పుడు పెళ్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అని రేఖ చెప్తుంది. అదేంటీ నిన్న గుడిలో అన్నావని అపర్ణ అడుగుతుంది.
కానీ ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నానని రేఖ అంటుంది. నా మనవరాలి పెళ్లి గ్రాంఢ్ గా జరిపిద్దామనుకున్నా కానీ ఇలా చేస్తున్నావ్ కానీ గుడిలోకి వెళ్లి గౌరీ పూజ అన్న చేయించాలని అపర్ణ రిక్వెస్ట్ చేస్తుంది. దానికి రేఖ ఒప్పుకుంటుంది. ఇందుని గుడికి తీసుకొని వెళ్లి అక్కడ పూజ చేయించుకొని తీసుకొని రా అని భ్రమరాంబతో రేఖ చెప్తుంది. అలాగే భ్రమరాంబ, ఇందు ఇద్దరు గుడికి బయల్దేరతారు. ఆల్రెడీ రాజు డ్రైవర్ గా వస్తాడు. కత్తితో భ్రమరాంబని బెదిరించి కిందకి దిగి వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
