.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -576 లో....భద్రవతి తన తమ్ముడు తిరుపతికి గుడిలో సడన్ గా నిశ్చితార్థం ఫిక్స్ చేసింది.సుక్కుతో పెళ్లి అవుతుందని కలలు కంటున్న తిరుపతిని సేనాపతి కారులో గుడికి తీసుకెళ్లాడు. అయిష్టంగానే కారు ఎక్కిన తిరుపతి.. గేటు దగ్గర ఉన్న ధీరజ్ కు సైగ చేయగా ధీరజ్ కు అనుమానం వస్తుంది. ప్రేమ ద్వారా.. బాబాయ్ కి గుడిలో నిశ్చితార్థం అని తెలుసుకుని ధీరజ్ షాక్ అయ్యాడు.
మరోవైపు రామరాజు రైస్ మిల్లులో డబ్బు మాయం అవుతుండటంతో చందుతో కలిసి వెళ్లాలని అనుకుంటాడు. ధీరజ్ వచ్చి తిరుపతి ఎంగేజ్మెంట్ విషయం చెప్తే రామరాజు.. భద్రవతి కోపంతో చేసినా తిరుపతికి పెళ్లై జీవితం మొదలవుతుంది కదా.. సంతోషించు అని అంటాడు. నర్మద మాత్రం.. సుక్కు, భాగ్యం డబ్బున్న వాళ్లను ట్రాప్ చేసి పెళ్లి చేస్తారు.. తిరుపతి అమాయకుడు అనడంతో వల్లి.. మా సుక్కు వెంట తిరుపతే పడ్డాడు.. మమ్మల్ని అంటావా అంటూ రచ్చ చేసి ఏడుపు డ్రామా చేస్తుంది. వల్లి వెంటనే భాగ్యంకు ఫోన్ చేసి గుడిలో నిశ్చితార్థం విషయం చెప్పడంతో సుక్కు, భాగ్యం షాక్ అవుతారు. వల్లి ప్లాన్ ప్రకారం సుక్కు ధీరజ్ కి ఫోన్ చేసి.. నన్ను ప్రేమించిన వాడికి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అంటే చచ్చిపోతా.. నా శవాన్ని చూస్తారంటూ సూసైడ్ డ్రామా మొదలుపెడుతుంది. మా ఇద్దరి చావుకు నువ్వే కారణం అవుతావని బెదిరించడంతో ధీరజ్ కంగారుపడి.. సుక్కు ఆగు, నేనే మీ పెళ్లి ఈరోజే చేస్తానని మాట ఇచ్చేశాడు.
తిరుపతి, సుక్కు పెళ్లి కోసం ప్రేమ లంగా ఓణీలో హీరోయిన్ లా రెడీ అవ్వగా ధీరజ్, ప్రేమ కలిసి వెళ్తుంటే నర్మద చూసింది. కోచింగ్ సెంటర్ కి వెళ్తున్నా అని ప్రేమ కవర్ చేసిన నర్మదకు డౌట్ వచ్చి బండి మీద ఫాలో అవుతుంది. ధీరజ్ కారులో ప్రేమ ఎక్కడం చూసిన నర్మద, వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకునేందుకు వెంబడిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
