Home

»

Tv News

Illu illalu pillalu : వల్లి పన్నిన వలలో రామరాజు ఫ్యామిలీ.. దొంగముద్రతో తిరుపతికి అవమానం!

Sep 2, 2026 4:11PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -568 లో అమాయకుడైన తిరుపతిపై వేదవతి 6 లక్షలు కొట్టేశాడని నింద వేయడంతో రామరాజు ఇంట్లో పెద్ద గొడవే మొదలైంది. నర్మద, ధీరజ్, సాగర్, చందు అందరు వేదవతి తీరును తప్పుపడుతూ.. నువ్వు కూడా మాట జారడం ఏంటమ్మా అని నిలదీస్తారు. అదే సమయంలో వల్లి మధ్యలో.. అత్తయ్యగారు తమ్ముడ్ని కన్నబిడ్డలా పెంచారు.. ఏ రోజు ఒక్క మాట అనలేదు. అలాంటి ఆవిడ దొంగ అన్నారంటే బలమైన కారణం లేకుండా ఉంటుందా అంటూ వేదవతికి సపోర్ట్ చేస్తుంది. ఆ కారణం ఏంటో చెప్పమని ధీరజ్, చందు అడిగినా వేదవతి మౌనంగా ఉండటంతో రామరాజు.. రహస్యాలు దాచడం అలవాటైపోయింది, చిన్నోడి పెళ్లి విషయంలో కూడా ఇలాగే చేసిందని కోపంగా అంటాడు. అందరూ నన్నే అనండి అంటూ వేదవతి  తలబాదుకుని ఏడుస్తూ వెళ్లిపోతుంది.

అటు భద్రవతి ఇంట్లో శారదాంబ భద్రావతిని నిలదీస్తుంది. ప్రేమను మొగుడికి దూరం చేసి ఇక్కడకు తెచ్చావు.. ఇప్పుడు పాతికేళ్ల అనుబంధాన్ని తెంచి తిరుపతిని కూడా తెచ్చేశావని. దానికి భద్రవతి తన నటనతో.. ధీరజ్ ప్రేమను కళ్యాణ్ తో లేచిపోయిందని అవమానించాడు. అందుకే వచ్చేసింది. అలాగే తిరుపతిని వేదవతి దొంగ అని ముద్ర వేసి తరిమేసిందని ప్రేమ, విశ్వ ముందు బాధపడుతున్నట్లు నటిస్తుంది. తిరుపతి దగ్గరకు వెళ్లి.. వాళ్ల కోసం భవిష్యత్తునే వృధా చేసుకున్నావు.. వాళ్లు పెళ్లి కూడా చేయకుండా దొంగ ముద్ర వేశారు.. ఇక వాళ్ల గురించి ఆలోచించకు, రేపే నీకు పెళ్లి చూపులు అంటూ మాయమాటలతో తనవైపు తిప్పుకుంటుంది.

ఇక రాత్రి విశ్వా అమూల్యను బయటకు పిలిచి కుటుంబ గొడవల గురించి మాట్లాడుతుండగా.. బాల్కనీలో ప్రేమ, ధీరజ్ ఒకరినొకరు ఈగోతో చూసుకుంటూ ఉంటారు. వారిని కలపాలని విశ్వ పేపర్ ప్లాన్ వేస్తాడు. మా బాబాయి మీద దొంగ అని నింద వేస్తావా అని ప్రేమ రాసి విసిరితే.. మా అమ్మ మాట వరసకి అడిగింది.. మీ కంచు అత్తే గొడవ పెట్టి తీసుకెళ్లిందని ధీరజ్ రాస్తాడు. ఆ తర్వాత.. మీ కుట్రలే అంత.. నెక్స్ట్ మా అమ్మనేనా అని ధీరజ్ అంటాడు. నెక్స్ట్ నువ్వేరా అని ప్రేమ రాసుకుని చివరికి గట్టిగా అరుచుకుంటారు. సాగర్ వచ్చి ధీరజ్ ని తీసుకెళ్లిపోతాడు. చివర్లో దొంగచాటుగా ఇంట్లోకి వస్తున్న అమూల్యను నర్మద పట్టుకుని.. మధ్యాహ్నం ఎక్కడికి వెళ్లావు.. నేను ఐస్ క్రీం పార్లర్ కి వచ్చానని అనడంతో అమూల్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com