కిన్నెర మొగులయ్యకు జగతి ఆర్ధిక సాయం.. దమ్ముంటే వైరల్ చేయండి
on May 10, 2024
.webp)
గుప్పెడంత మనసు సీరియల్ నటి జగతి మేడం అలియాస్ జ్యోతి పూర్వజ్ ప్రైవేట్ వీడియోస్ సోషల్ మీడియాలో కొంత మంది పని గట్టుకుని లీక్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోకి టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఇప్పుడు ఆమె తన మంచితనాన్ని ప్రదర్శించింది. ఆమె కిన్నెర మొగులయ్యకు ఆర్ధిక సాయాన్ని అందించారు. ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. "అక్షయ తృతీయ పర్వదినాన, ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న పద్మశ్రీ కిన్నెర మొగలయ్య గారికి నేను ₹50,000 ఆర్థిక సహాయం అందించాను.
ఆయన ఒక రకంగా బాధపడుతున్నారు. నేను అలాంటి బాధను అనుభవిస్తున్నాను. అందుకే ఆయన బాధ నా మనసును కదిలించింది. ఎలాగైనా ఆయన్ని చేరుకొని ఆయనతో కలిసి ఒక పూట భోజనం చేసే అదృష్టాన్ని దక్కించుకుని నా మనసులో బాధను పోగొట్టుకున్నాను. అలాగే ఆయనలోని కళను సపోర్ట్ చేయాలనిపించింది. అందుకే నాకు తోచినంత సాయం చేసాను.

మీకు కూడా ఆయన కళను ప్రోత్సహించాలని ఉంటే , ఆయనకు సాయం చేయాలి అనుకుంటే ముందుకు రండి కలిసి చేద్దాం" అని ఒక సుదీర్ఘ మెసేజ్ ని పోస్ట్ చేసింది. అలాగే ఈ ట్రోలర్స్ కి కూడా ఒక ఘాటు మెసేజ్ ఇచ్చింది. "ఇప్పుడు ఈ వీడియోను వైరల్ చేసే ధైర్యం మీకు ఉందా ? ఇది జెన్యూన్ వీడియో..ఈ మాట ఎందుకన్నాను అంటే ఉద్యోగం, సద్యోగం లేక చదువుకుని చిల్లరగా టైం పాస్ చేసే వాళ్ళ కోసమే ఇది..మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా , నన్ను చీకట్లోకి తోసేసినా..భయపడను మరింతగా ప్రకాశిస్తూ పైపైకి వస్తాను. ఫీనిక్స్ పక్షిలా నేను ఎప్పుడూ పాజిటివ్ మైండ్ తోనే ఉంటాను." అంటూ పోస్ట్ చేసింది జగతి మేడం అలియాస్ జ్యోతి పూర్వజ్..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



