Godavari Serial: జాను, సంజయ్ ల పెళ్ళి.. నందు ఫైర్!
Nov 25, 2026 8:31AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 172లో.. జానుకి మెడలో సంజయ్ మూడు ముళ్లు వేస్తాడు. నందు జాను ఫంక్షన్ దగ్గరకు వచ్చి సూత్రం గుచ్చొచ్చా అని అడుగుతుంది. సంతోషంగా గుచ్చమ్మా అని శారద చెప్తుంది. నందు పుస్తెలు గుచ్చడం దగ్గరకు వెళ్లి ఎవరూ చూడకుండా పుస్తెను మార్చేస్తుంది. జానుని చూసి మనసులో జాను సిటీకి వచ్చి నీ స్వార్థం నువ్వు చూసుకున్నందుకు నాకు నీ మీద కోపం తగ్గలేదు కానీ నువ్వు నీ భర్త సంతోషంగా ఉండాలి.. నీ కాపురం బాగుండాలని కోరుకుంటుంది.
నందు తాళిని అందరికి చూపించి తెస్తుంది. ఇక పంతులు జాను, సంజయ్‌తో జీలకర్రా బెల్లం పెట్టిస్తారు. తర్వాత పంతులు తాళి కట్టమని చెప్తారు. జాను సంజయ్‌తో రెండు ముడులే వేయ్ అని చెప్తుంది. ఆ రెండే అని సంజయ్ అంటూ రెండు ముళ్లు వేస్తాడు. అది చూసిన బామ్మ, తాతయ్యలు మూడో ముడి వేయరా అని చెప్పడంతో సంజయ్ మూడో ముడి వేస్తాడు. జానుతో తప్పలేదని చెప్తాడు. జాను తాళి పట్టుకొని చాలా టెన్షన్ పడుతుంది. కానీ రెండు కుటుంబాలు మాత్రం చాలా సంతోషపడతారు. తర్వాత దండలు మార్చుకుంటారు. ఆ రోజు పెళ్లి చూడలేకపోయినా ఈ రోజు చూసే అవకాశం దొరికిందని అందరు అనుకుంటారు. తర్వాత చిటికెన వేలు పట్టుకొని ఏడు అడుగులు వేస్తారు. పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.
నందు ఇంటికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీ అందరితో మీకు జాను ఫంక్షన్‌కి వెళ్లొద్దని చెప్తే ఎందుకు వెళ్లారని అడుగుతుంది. అందరి మీద కోప్పడుతుంది. దానికి బామ్మ ఫంక్షన్‌కి వెళ్లొద్దు అన్న నువ్వు రెండు తాళి బొట్లు ఎందుకు కొన్నావని అడుగుతారు. నేను జాను కోసం తెచ్చాను తనకి ఇవ్వమని చెప్పానా.. ఇంట్లో ఇంకో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని డబ్బులు ఉన్నాయని కొనిపెట్టా అంటుంది. అందరిని తిట్టావ్ ఓకే మరి నువ్వు ఎందుకు ఫంక్షన్ దగ్గరకు వచ్చావని బామ్మ అంటుంది. దానికి గౌతమి కాల్ చేసి మీరు ఫంక్షన్‌కి వెళ్లారని చెప్పింది.. రెండు తాళి బొట్లు తనకే ఇచ్చేస్తారని కంగారుగా వచ్చానని నందు అంటుంది. ఇంకో సూత్రం ఎక్కడ అని నందు అడిగితే మురళీకి దాయమని ఇచ్చా అని బామ్మ అంటుంది. నందు మనసులో నువ్వు కట్టిన తాళి నువ్వే కాపాడావు బావ అని అనుకుంటుంది. ఇక జాను పెళ్లి మండపం మీదకి వచ్చి ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




