.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -112 లో.... చక్రి కాలేజీకి వెళ్ళడానికి అద్దం ముందు రెడీ అవుతాడు. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావ్ దువ్విన తలనే దువ్వుతున్నావని కేశవ అడుగుతాడు. మహాతో కాలేజీకి వెళ్తున్నాను.. సర్టిఫికెట్స్ కోసం ఇప్పుడు నా చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తుంది. చూడమని చక్రి అంటాడు. అంత సీన్ లేదు.. అసలు నిన్ను వద్దని అంటుంది. చూడమని కేశవ అంటాడు. నా చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తుందని చక్రి ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడే మహా వచ్చి.. పెద్ది మేం కాలేజీకి వెళ్తునామని చెప్తుంది. పదా చక్రి అని మహా అంటుంది. ఒక్క నిమిషం అంటూ అద్ధం దగ్గర తల దువ్వుకుంటూ లేట్ చేస్తాడు. రా చక్రి ఆంటు మహా తన చెయ్ పట్టుకొని తీసుకొని వెళ్తుంది. అది చూసి నువ్వు మాములోడివి కాదురా అని కేశవ అనుకుంటాడు.
మరొకవైపు మహా, చక్రి కాలేజీకీ వెళ్లి సర్టిఫికెట్స్ తీసుకుంటారు. అది చూసి మహా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చక్రి ఒక్క నిమిషం పక్కకి వస్తావా అని అక్కడ మేడమ్ అంటుంది. దాంతో చక్రి పక్కకి వెళ్తాడు. మొన్న క్యాబ్ లో వచ్చినప్పుడు డబ్బు ఇవ్వలేదు తీసుకోమని ఇస్తుంది. మేడం వెళ్తుంటే పడబోతుంది. దాంతో చక్రి పట్టుకుంటాడు. మేడమ్ స్టికర్ తనకి అంటుకుంటుంది. ఆ తర్వాత చాలా థాంక్స్ చక్రి నా సర్టిఫికెట్స్ నా దగ్గరికి వచ్చాయని మహా చెప్తుంది. ఇద్దరు కార్లో వెళ్తుంటే చక్రికి అంటుకున్న స్టికర్ మహా చూసి స్టికర్ గురించి అడుగాల వద్దా అనుకుంటుంది. చక్రి ఒక దగ్గర కార్ ఆపుతాడు. ఏం అడగాలనుకుంటున్నారు చెప్పండి అని చక్రి అనగానే మేడమ్ నువ్వు లోపలికి ఎందుకు వెళ్లారని అడుగుతుంది. మేడమ్ డబ్బు ఇచ్చిందని చక్రి చెప్తాడు. మరి ఈ స్టికర్ ఏంటి అని మహా అడుగుతుంది. అదా మేడమ్ పడబోతుంటే పట్టుకున్నాను.. అప్పుడే అంటుకున్నట్లు ఉందని చక్రి అంటాడు అంతేనా నమ్మొచ్చా అని మహా అంటుంది. నిజమని చక్రి చెప్తాడు.
ఆ తర్వాత గాయత్రి తన భర్తతో ఇంటికి వస్తుంది. నేను పక్కింటికి వెళ్ళొస్తా అని గాయత్రి చెప్తుంది. వద్దని తాయారు అంటుంది. నువ్వు కాదు చెప్పాల్సింది ఇప్పుడు నా బాధ్యత ఆయనది అని గాయత్రి అంటుంది. సరే నువ్వు వెళ్లి మాట్లాడిరా అని తన భర్త వినోద్ అంటాడు. ఆ తర్వాత మాధవ దగ్గరికి గాయత్రి వెళ్లి మాట్లాడుతుంది. కంగారుపడకు బావ వేరొకరికి భార్యగానే వచ్చానని గాయత్రి అంటుంది. అప్పుడే కన్నా వచ్చి చూసి చక్రికి ఫోన్ చేసి గాయత్రి వచ్చిందని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
