రేవంత్, శ్రీహాన్ మధ్య 'టికెట్ టు ఫినాలే'.. గెలుపు ఎవరిది?
on Dec 3, 2022
బిగ్ బాస్ హౌస్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'టికెట్ టు ఫినాలే' రేస్ వారం రోజుల నుండి జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రేస్ చివరి దశకి చేరుకుంది. ఇందులో ఒక్కో టాస్క్ లో ఒక్కొక్కరుగా రేస్ నుండి తొలగిపోయారు. అయితే ఈ రేస్ లో అందరూ కూడా నువ్వా నేనా అన్నట్టు తగ్గ ఫోటీ ఇస్తూ వచ్చారు. ఒక్కో లెవెల్ కి ఒక్కొక్కరుగా తప్పుకోగా, చివరికి స్కోర్ బోర్డు పై అందరి కంటే ఎక్కువ పాయింట్స్ తో రేవంత్ మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో ఆదిరెడ్డి, శ్రీహాన్ ఇద్దరూ సమానమైన పాయింట్లతో ఉన్నారు.
దీంతో బిగ్ బాస్ 'టై బ్రేకర్ టాస్క్' ఇచ్చాడు. ఆదిరెడ్డి, శ్రీహాన్ ఇద్దరు పాల్గొన్న ఈ టాస్క్ లో శ్రీహాన్ గెలిచాడు. అయితే రేపటి ఎపిసోడ్ లో రేవంత్ తో పాటుగా శ్రీహాన్ ఫైనల్ లెవల్ ఆడనున్నాడు.
అయితే ఈ రేస్ ఆ ఇద్దరిని శత్రువులుగా మారుస్తోందో? లేదో చూడాలి. ఎందుకంటే హౌస్ లో రేవంత్, శ్రీహాన్ లు ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్న విషయం తెలిసిందే. మళ్ళీ ఇద్దరు కూడా హౌస్ లో మంచి ఫైటర్స్ గా ఉన్నారు. ఒకరిని మించి ఒకరు పోటా పోటీగా ఆడుతారు. అయితే ఇద్దరిలో ఎవరికి ఈ సీజన్ లో 'టికెట్ టు ఫినాలే' లభిస్తుందో చూడాలి మరి!