ENGLISH | TELUGU  
Home  » TV News

Eto Vellipoyindhi Manasu : అమ్మ ఆపరేషన్ కి డబ్బులు కావాలి .. నాపై నమ్మకం లేదా!

on Apr 19, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -75 లో.. అభిని రామలక్ష్మి చూసి ఆగమని చెప్తుంది. ఎందుకు ఫారెన్ వెళ్ళలేదని అడుగుతుంది. నిన్ను వదిలి వెళ్ళాలనిపించలేదని అభి అనగానే.. అదేంటీ మీ అమ్మకి బాగోలేక వెళ్లలేదని సీతాకాంత్ సర్ చెప్పారు అని రామలక్ష్మి అంటుంది. దాంతో అభి షాక్ అవుతాడు. అది కూడా ఒక కారణమే అని అభి కవర్ చేస్తాడు. నువ్వు ఇంకా కొన్నిరోజులు సీతా సర్ భార్యగా నటించక తప్పదని అభి అంటాడు. దానికి రామలక్ష్మి కూడా సరేనంటుంది. నువ్వు అక్కడ ఎన్ని రోజులు ఉంటే అంత డబ్బు సీతా సర్ దగ్గర నుండి లాగొచ్చని అభి అనుకుంటాడు.

మరొకవైపు రామలక్ష్మిని అందరి ముందు భార్య అని చెప్పిన విషయాన్ని సీతాకాంత్  గుర్తుకుచేసుకుంటాడు. అప్పుడే అభి తన దగ్గరికి వస్తాడు. అభిని సీతాకాంత్ పక్కకు తీసుకొని వెళ్లి.. ఇలా రాకూడదని చెప్పాను కదా.. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్ అంతే గాని ఇలా డైరెక్ట్ గా రాకూడదని సీతాకాంత్ అంటాడు. సర్ అవసరం అలాంటిది మా అమ్మకి ఆపరేషన్ చెయ్యాలి.. దానికి ముప్పై లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పారని అనగానే.. ఆ డబ్బులు నేను ఇస్తాను. నువ్వు కంగారుపడకని చెక్ బుక్ తీసుకొని వచ్చి.. హాస్పిటల్ నేమ్ చెప్పమని అడుగుతాడు. అభి తడబడుతు.. హాస్పిటల్ నేమ్ ఎందుకు నాపై నమ్మకం లేదా అని యాక్టింగ్ చేస్తుంటాడు. అదేం లేదని అభి పేరుపై చెక్కు ఇస్తాడు. ఆ తర్వాత థాంక్స్ అంటూ అభి అనగానే.. నువ్వే నాకు చాలా హెల్ప్ చేసావ్ రామలక్ష్మిని నాకు భార్యగా నటించేందుకు ఒప్పించ్చావని సీతాకాంత్ అంటాడు.

ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరకి శ్రీవల్లి వచ్చి.. శోభనానికి రెడీ చేయమని అత్తయ్య పంపించారని అనగానే.. నాకు తలనొప్పి అని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోలేదు శోభనానికి రెడీ అవ్వమంటే ఇలా అంటుందని శ్రీలతకి శ్రీవల్లి చెప్తుంది. అప్పుడే సిరి వచ్చి.. రామలక్ష్మి కి కొంచెం టైమ్ ఇవ్వండి అని అంటుంది. దాంతో సిరిపై శ్రీలత అరుస్తుంది. అలా ఎందుకు అంటున్నారు అత్తయ్య అని ధన అనగానే.. ఎవడ్రా నీకు అత్తయ్య అంటు శ్రీలత కోప్పడుతుంది.. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి శ్రీలత వెళ్లి.. మీరు పెళ్లి చేసుకున్నారా లేదా నిజం చెప్పమని అడుగుతుంది. చేసుకున్నామని రామలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ రాగానే రెడీ అవ్వు.. ఈ రోజు శోభనమని శ్రీలత చెప్తుంది. ఇప్పుడు ఎందుకని సీతాకాంత్ అంటాడు. మీరు ఇలా వద్దని అంటుంటే.. పెళ్లి చేసుకోలేదన్న డౌట్ వస్తుందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.