TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

తన ప్రాణాలు అడ్డు పెట్టి భర్తని కాపాడుకున్న భార్య!

Nov 15, 2024 9:00AM

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -253 లొ.....సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్తుంటే.. చూడు మీ అయన ఎలా చావుకి ఎదురు వెళ్తున్నాడోనని శ్రీలత అంటుంది. నా ప్రాణం అడ్డు పెట్టి అయినా నా భర్త ప్రాణాలు కాపాడుకుంటానని రామలక్ష్మి అంటుంది. మర్యాదగా నువ్వు ఎవరికి ఫోన్ చేసావో వాళ్ళకి ఫోన్ చేసి మా ఆయనని ఏం చెయ్యకని చెప్పు అనగానే.. నేను చెప్పను. నీ ఫోన్ తీసుకొని ఎవరితో మాట్లాడావో సాక్ష్యం మా ఆయనకి చూపిస్తానని  సందీప్ ఫోన్ ని రామలక్ష్మి లాక్కోబోతుంటే శ్రీలత లాక్కొని కింద పడేస్తుంది.

ఆ తర్వాత అయనని ఎలాగైనా కాపాడుకోవాలని సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వెళ్లి.. ఏమండి ఈ రోజు ఆఫీస్ కి వెళ్లకని అంటుంది. వెళ్తానని సీతాకాంత్ అనగానే నేను వస్తానని రామలక్ష్మి వెళ్లి కార్ లో కూర్చుంటుంది. అది చూసి ఇక ఒకే దెబ్బకి రెండు పిట్టలు అని సందీప్ అనుకుంటాడు. ఆ విషయం శ్రీలత, శ్రీవల్లిల దగ్గరికి సందీప్ వచ్చి చెప్తాడు.మరొకవైపు రామలక్ష్మి అటు చుడండి ఇటు చుడండి ఆ వెహికల్ ఇటు వైపే వస్తుందని సీతాకాంత్ ని కంగారుపెడుతుంది. సందీప్ అరెంజ్ చేసిన రౌడీ వెహికల్ ని రామలక్ష్మి తప్పిస్తుంది దాంతో చెట్టుకి వెహికల్ తగలడంతో రామలక్ష్మి తలకి గాయం అవుతుంది. 

మరొకవైపు వాళ్ళు చనిపోయారనే న్యూస్ తెలిసాక మనం సంబరాలు చేసుకోవాలన్నారు కదా స్వీట్ ఆర్డర్ చేస్తానని శ్రీవల్లి అనగానే.. తాతయ్య కి డౌట్ వస్తుందని సందీప్ అంటాడు. అప్పుడే పెద్దాయన వచ్చి..  ఏంటి డౌట్ వచ్చేది అనగానే డైవర్ట్ చేసి మాట్లాడుతాడు. ఆ తర్వాత గాయం అయిన రామలక్ష్మిని సీతాకాంత్ తీసుకొని వచ్చి గదిలోకి వెళ్తాడు. దాంతో ఏమైందంటూ అందరు అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img