Eto Vellipoindi Manasu : వాడే ఎటాక్ చేసింది.. సీసీటీవీ ఫుటేజ్ లో ఏం ఉందంటే!
on Oct 2, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -215 లో.. రామలక్ష్మి ఆఫీస్ కి వెళ్తుంటే సీతాకాంత్ అన్ని తనకి రెడీగా ఉంచుతాడు. తనే స్వయంగా టిఫిన్ తినిపిస్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ కి డిటెక్టివ్ ఫోన్ చేసి పనిమనిషిగా నందిని ఇంట్లో చేరానని చెప్తాడు. అయితే ఏదైనా తెలిసిందా అని సీతాకాంత్ అడుగుతాడు. ఇప్పుడు నాకు డబ్బులు కావాలని అనగానే సీతకాంత్ తనకి డబ్బులు పంపిస్తాడు.
ఆ తర్వాత సందీప్ దగ్గరికి సీతాకాంత్ పై ఎటాక్ చేసిన అతను వస్తాడు. నాకు డబ్బులు ఇవ్వలేదని అనగానే.. అనుకున్నది చెయ్యలేదు.. నీకు డబ్బులు ఎక్కడివి అని సందీప్ అంటాడు. నేను ట్రై చేశాను ఎటాక్ కోసం గదిలోకీ వెళ్తే వేరొక అమ్మాయి ఉంది. కవర్ చెయ్యడానికి దొంగలా నటించాను. అప్పుడే సీతాకాంత్ వెంబడించి పట్టుకోబోతుంటే నేను నెడితే అలా అయిందని రౌడీ అంటాడు. అదంతా బ్లూ టూత్ ద్వారా నందిని వింటుంది. దీనికి కారణం సందీప్ ఆ అనుకుంటుంది. ఆ రౌడీ ని పట్టుకుంటే అంతా బయటపడుతుందని నందిని బయటకి వస్తుంది. అప్పుడే రౌడీ బయటకు వెళ్తుంటే.. రామలక్ష్మి వస్తుంది. తనని చూసి రౌడీ మాస్క్ పెట్టుకుంటాడు. అప్పుడే రౌడీ పర్సు కిందపడిపోతుంది. దాంతో రామలక్ష్మి అతనికి పర్సు ఇచ్చి లోపలికి వస్తుంది. నందిని వచ్చేసరికి రౌడీ వెళ్ళిపోతాడు. అతడిని ఎక్కడో చూసానని రామలక్ష్మి అనుకుంటుంది. సిరి అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. రౌడీ చేతిపై స్నేక్ టాటూ ఉంటుంది అంటుంది. రామలక్ష్మి పర్సు ఇచ్చేటప్పుడు అతని చేతికి ఉన్న స్నేక్ టాటూ చూసి.. అతనే అంటూ మళ్ళీ బయటకు వచ్చి చూస్తుంది. ఆ రౌడీని చూసావా అని మాణిక్యాన్ని రామలక్ష్మి వెళ్లి అడుగుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి, మాణిక్యం లు వెళ్లి సీసీ టీవీ ఫుటేజ్ చూస్తారు. అందులో రౌడీ సందీప్ దగ్గరికి వెళ్లినట్లు ఉంటుంది.
ఆ తర్వాత హారికని ఏదైనా క్లూ దొరికిందా అని నందిని అడుగుతుంది. సందీప్ ని అలా అడిగితే మనపై డౌట్ వస్తుంది. కాస్త ఓపిక పట్టు అని నందినికి హారిక సలహా ఇస్తుంది. మరొక వైపు అల్లుడు గారు నీకు లంచ్ పంపారని మాణిక్యం బాక్స్ తీసుకొని వచ్చి రామలక్ష్మికి ఇస్తాడు. అందులో లెటర్ కూడా ఉంటుంది. అది చదువుతు రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొక వైపు రామలక్ష్మికి సీతాకాంత్ చాటుగా మల్లె పువ్వులు తీసుకొని వెళ్తుంటే.. సిరి వాళ్లు చూసి నవ్వుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read