విష్ణుప్రియకి రెండు పెళ్లిళ్ళా!?
on Aug 17, 2022
విష్ణుప్రియ యాంకర్ గానే కాదు ఇప్పుడు యాక్టర్ గా కూడా నిరూపించుకోబోతోంది. మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ వస్తుంటే వాటిని కూడా చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పుడు ఆమె నటించిన 'వాంటెడ్ పండుగాడ్' మూవీ రాబోతోంది. ఈ మూవీలో అనసూయ, సుడిగాలి సుధీర్, విష్ణుప్రియ, దీపికా పిల్లి, సునీల్ పాత్రలు నవ్వు తెప్పిస్తాయి. ఆగష్టు 19న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా క్యాష్ షోకి వచ్చారు నిత్యాశెట్టి, యశ్వంత్ మాస్టర్, విష్ణుప్రియ, అనసూయ, రాఘవేంద్ర రావు. ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.
ఈ షోలో రాఘవేంద్రరావు, విష్ణుప్రియ మాములుగా రచ్చ చేయలేదు. రెండు ఆపిల్స్ తో ఆడుతూ "శ్రావణ మాసంలో నాకు రెండు పళ్ళు ఇచ్చారు" అంటూ గెంతింది విష్ణుప్రియ. సుమ వచ్చి "ఒక పండు నువ్వు, మరో పండు మీ ఆయన, ఇదిగో ఇంకో పండు ఇది నీకు పుట్టబోయే బాబో, పాపో.." అనేసరికి విష్ణు గట్టిగా నవ్వుతూ "నాకు క్యాష్ వద్దు ఇంక" అని చెప్తుంది. దాంతో సుమ "నీ చేతిలో పళ్ళ కంటే నీ నోట్లో పళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి" అని కౌంటర్ వేసింది.
తర్వాత గ్లామరస్ యాంకర్ అనసూయతో కలిసి ఈ షోకి ఎంట్రీ ఇచ్చారు కె. రాఘవేంద్రరావు. ఆయనకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది సుమ. వెంటనే సుమ రాఘవేంద్రరావుకి ఫ్లవర్ బొకే ఇస్తుంది. అది తీసుకున్న ఆయన బొకేని విష్ణుప్రియ వైపు విసిరేస్తారు. దీంతో ఆ బొకేని పట్టుకుని "హమ్మయ్య పెళ్లైంది నాకు" అంటూ ఎగిరి గంతేస్తుంది.
ఇది విని ఆశ్చర్యపోయిన సుమ "ఇలా విసిరేస్తే పెళ్లవుతుందా?" అని అనసూయకి ఇచ్చిన ఫ్లవర్ బొకే ని రిటర్న్ తీసేసుకుని విష్ణు మీదకు విసిరేస్తుంది. అది కూడా క్యాచ్ పట్టుకుని రెండు పెళ్లిళ్లయ్యాయని గోల చేసేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ ఐపోతారు. ఇక రాఘవేంద్రరావు చేసిన సందడి నెక్స్ట్ లెవెల్.