నాకు పుట్టిల్లు ఐనప్పుడు తనకు అత్తవారిల్లే కదా...
on Dec 2, 2022
లేడీస్ అండ్ జెంటిల్మన్ షో ఎవ్రీ వీక్ ఫుల్ కామెడీతో సాగిపోతోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి సింగర్స్ అండ్ రైటర్స్ ఐన చంద్రబోస్, ధనుంజయ్, అనూప్ రూబెన్స్ వాళ్ళ వాళ్ళ భార్యలతో ఈ షోకి వచ్చారు. "నేను సుచిత్రను షోస్ కి తీసుకురావాలి అంటే బుజ్జగించాలి..కానీ జీ తెలుగుకి రమ్మంటే వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ జీ తెలుగు నాకు పుట్టిల్లు ఐతే సుచిత్రకు అత్తవారిల్లు" అని చెప్పారు చంద్రబోస్.
ఇక తర్వాత సింగర్ ధనుంజయ్ తన వైఫ్ తో స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు "పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఒక పాట పాడి మా మావయ్యగారి మనసు కరిగించాను" అని చెప్పి ఫుల్ కామెడీ చేశారు. ఇక ఫైనల్ గా అనూప్ రూబెన్స్ తన వైఫ్ తో రెండు స్టెప్స్ వేసి స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు. ప్రదీప్ అనూప్ రూబెన్స్ కి అద్దం ఇచ్చి లవ్ ప్రొపోజ్ చేయమని టాస్క్ ఇచ్చాడు. " అద్దంలో కనిపించేది ఎవరికి వారు..ఇద్దరిలో కనిపించేది ఒకరికి ఒకరు" అనే పాట పాడి తన వైఫ్ ని ఇంప్రెస్ చేసాడు. ఇక తర్వాత వీళ్లకు కొన్ని టాస్కులు ఇచ్చి ఆడించాడు ప్రదీప్. ఈ షో డిసెంబర్ 4 న ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.