TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Brahmamudi : నిజం చెప్పేసిన అపర్ణ.. కావ్య, రాజ్ ఒక్కటయ్యేనా!

Aug 29, 2025 10:06AM

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -812 లో.. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో చెప్పండి అని కావ్యని రాజ్ అడుగుతాడు. నిజం ఎలాంటిది అయినా కూడా నేను మీకు తోడుగా ఉంటానని కావ్యతో రాజ్ అనగానే అప్పుడే యామిని ఎంట్రీ ఇస్తుంది. ఆవిడ ఎందుకు నిజం చెప్తుంది బావ.. చెప్పదు ఎవరితోనో కడుపు తెచ్చుకున్నా కూడా మంచి మనసుతోని నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావ్.. అయిన వాళ్ళు చెప్పరని యామిని అంటుంది.

ఏం అన్నావే అని అపర్ణ యామిని చెంపచెల్లుమనిపిస్తుంది. అసలు నా కోడలు గురించి ఎలా తప్పుగా మాట్లాడుతున్నావని యామినిపై కోప్పడుతుంది అపర్ణ. తనపై కోప్పడడం కాదమ్మ.. ఇప్పుడు నేను అడుగుతున్నా చెప్పండి తన కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు నిజంగానే తాను ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుందా అని రాజ్ అనగానే రాజ్ చెంపచెల్లుమానిపిస్తుంది అపర్ణ. ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు దాని భర్తవి.. నువ్వే తన కడుపులో బిడ్డకి తండ్రివి అని అపర్ణ అంటుంది. అపర్ణ అన్ని నిజాలు చెప్పగానే రాజ్ కళ్ళు తిరిగిపడిపోతాడు. వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు.

ఆ తర్వాత రాజ్ ని ఆ పరిస్థితిలో చూసి అపర్ణ బాధపడుతుంది. పిచ్చిదాన్ని అలా మాట్లాడి ఉండకుండాల్సింది అని బాధపడుతుంది. తరువాయి భాగం లో రాజ్ స్పృహలోకి వచ్చి కళావతి గారు బానే ఉన్నారు కదా అని అడుగుతాడు. రాజ్ చెయ్ ని కావ్య పట్టుకొని.. ఇక ఎప్పటికి ఈ చెయ్ వదలనని కావ్య చెప్తుంది. అదంతా యామిని చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 

google-ad-img