అత్తగారికి ఆ టాబ్లెట్స్ ఇచ్చిన కోడలు.. ఆమె ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
on Sep 8, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్- 509 లో.. కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా దుగ్గిరాల కుటుంబమంతా గుడికి వస్తారు. ఇక అప్పుడే కళ్యాణ్, అప్పు కూడా అదే గుడికి వస్తారు. ఈ రోజు దుగ్గిరాల కళ్యాణ్ పుట్టిన రోజు.. అతడి పేరు మీద అర్చన చేసి.. అన్నదానం చేయడానికి వచ్చామని పూజారితో రాజ్ చెప్పడంతో కళ్యాణ్, అప్పు చాటుగా నిలబడి విని సంతోషిస్తారు. ఇక రాజ్ చూపు అప్పుడే కళ్యాణ్ మీద పడుతుంది. వెంటనే ధాన్యలక్ష్మి, ప్రకాశం వాళ్లతో.. పిన్నీ బాబాయ్.. మీరిద్దరూ అన్నదానం ఏర్పాట్లు చూసుకుంటూ ఉండండి ఇప్పుడే వస్తానని కళ్యాణ్ వాళ్ల వైపు వెళ్తాడు రాజ్. అయితే అది గమనించిన కళ్యాణ్.. అప్పు త్వరగా అన్నయ్య మనల్ని చూసేశాడు.. వెళ్లాలంటూ చేయి పట్టుకుని వేగంగా నడుస్తాడు. అయితే రాజ్.. కాసేపటికి ఎదురుగా నిలబడి.. కళ్యాణ్ ఆగండి అని అంటాడు. ప్రేమగా కళ్యాణ్ ని హగ్ చేసుకుని.. హ్యాపీ బర్త్ డే రా కళ్యాణ్ అని అనగా.. థాంక్స్ అన్నయ్య అని కళ్యాణ్ అంటాడు. పరాయివాడిలా దూరం నుంచి చూసి వెళ్లిపోతున్నావేంట్రా అని రాజ్ అనగా... నా కోసం చేస్తున్న కార్యక్రమంలో నేనుంటే ఎంత ప్రమాదమో నాకు తెలుసు అన్నయ్య అని కళ్యాణ్ అంటాడు. అని నీకు నువ్వు అనుకుంటే ఎలారా అని రాజ్ అంటాడు.
మరోవైపు కావ్యకు రాహుల్ మనిషి కాల్ చేస్తాడు. మేడమ్ కంపెనీ స్టోర్ ఇన్‌ఛార్జ్‌ని కాల్ చేస్తున్నాను.. రాహుల్ చాలా పెద్ద ఫ్రాడ్ చేస్తున్నాడు. తనను కంపెనీ నుంచి తొలగించారనే కోపంతో కంపెనీని సీజ్ చేయించాలని ఏవో దొంగ పత్రాలు సృష్టిస్తున్నాడు.. మీరు త్వరగా వస్తే ఇప్పుడే దాన్ని ఆపొచ్చని అంటాడు. అది విన్న కావ్య.. అపర్ణ దగ్గరకు వెళ్లి.. అత్తయ్యా నాకు ఫోన్ వచ్చింది.. రాహుల్ ఇలా చేస్తున్నాడట అని మొత్తం చెబుతుంది. దాంతో నువ్వు వెళ్లు అని అపర్ణ అంటుంది. అత్తయ్యా.. ఆయన నన్ను కంపెనీ విషయంలో.. రాహుల్ విషయంలో కలుగజేసుకోవద్దన్నారు. ఆయనకే కాల్ చేసి వెళ్లమని చెబుతాను అత్తయ్యా అని కావ్య అనగా.. వద్దు.. గుడికి ఆఫీస్‌కి దూరం.. వాడు రావడానికి టైమ్ పడుతుంది. ముందు నువ్వు వెళ్లు.. భయపడకు.. వాడికి నేను చెబుతానని అపర్ణ అంటుంది. దాంతో లోపలికి వెళ్లిన కావ్య రుద్రాణి మార్చేసిన టాబ్లెట్స్ బాటిల్ తెచ్చి.. అపర్ణకి ఇచ్చేసి.. అత్తయ్యగారు.. కూర దింపేసి, తిన్నాక ఓ అరగంటలో ఈ టాబ్లెట్ వేసుకోండి.. నేను త్వరగా వచ్చేస్తానని వెళ్తుంది.
మరోవైపు గుడిలో ప్రకాశం ధాన్యలక్ష్మి మీద సీరియస్ అవ్వడంతో.. కళ్యాణ్, అప్పులు అన్నదానంలో పాల్గొంటారు. ఇప్పుడు నేను చెబుతున్నాను.. నేను నా తమ్ముడు కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నా భార్య చెల్లెలు అప్పుని.. ఆమె భర్తని భోజనానికి పిలిచాను.. ఆ జనాల వరుసలో వీళ్లతో పాటు నేను కూర్చుంటాను. మా ముగ్గురికి నువ్వే వడ్డించాలి.. దుగ్గిరాల వారి సంప్రదాయం ప్రకారం భోజనానికి ఎవరు కూర్చున్నా మర్యాదలు తగ్గకూడదు.. గుర్తుపెట్టుకోమని ఆజ్ఞాపించి.. తమ్ముడ్ని మరదల్ని తీసుకుని వెళ్లి.. బంతిలో వరసగా కూర్చోబెడతాడు రాజ్. తాను కూడా కూర్చుంటాడు. స్వప్న ఆకులు వేయి అని రాజ్ అంటాడు. నీకు బొట్టుపెట్టి చెప్పాలా.. నీళ్లు పట్టుకుని నడు అంటూ రాహుల్ మీద అరుస్తుంది స్వప్న. అదే సమయంలో స్వీటు, పులిహోరా ఇలా అన్నీ ధాన్యంతోనే వడ్డించేలా చేస్తాడు ప్రకాశం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read