TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

ప్రేరణ ఇంట్లో విషాదం ...

Sep 19, 2024 2:15PM

 

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా మారుతోంది. ఎందుకంటే ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అమ్మాయిల్లో యాష్మి, ప్రేరణ, బెబక్క, సీత, విష్ణు ఇలా ఈ టీమ్ అంతా కూడా అబ్బాయిలతో ఢీ అంటే ఢీ అనే టైపు. ఐతే ఇందులో బెబక్క ఎలిమినేట్ ఐపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ప్రేరణ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్.. మహానటి అని చెప్పొచ్చు. అన్ని రకాలుగా ఎవరినీ నొప్పించని మనస్తత్వం. గేమ్స్ బాగా ఆడుతుంది. మంచి కామెడీ పీస్ కూడా. అలాంటి ప్రేరణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

ప్రేరణ భర్త శ్రీపద్‌ వాళ్ల అమ్మమ్మ కన్నుమూశారు.  ఐతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఆమెకు ఇంకా ఈ విషయం గురించి తెలీదు. ఐతే మరి బిగ్ బాస్ ఈ విషయం గురించి ఆమెతో ఎలా చెప్తాడు అన్న పాయింట్ ఇప్పుడు ఇంటరెస్టింగ్ గా మారింది. ఐతే బిగ్ బాస్ ఆమెను ఇంటికి పంపించేస్తాడా లేదా ఆమెకు నచ్చజెప్పి హౌస్ లో కొనసాగేలా ఛాయస్ ని ఆమెకే వదిలేస్తాడా  అనేది తెలియాల్సి ఉంది.  ఎందుకంటే ఈ సీజన్ లో ప్రేరణ స్ట్రాంగ్ కంటెస్టెంట్ మాత్రమే కాదు మంచి కంటెంట్ ఇస్తున్న హౌస్ మెట్ కూడా. మరి ఇలాంటి టైంలో ఆమె బయటకు వెళ్ళిపోతే ఆమె ఫ్యాన్స్ బాధపడే అవకాశం కనిపిస్తోంది. ఒక వేళ ప్రేరణ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతే మాత్రం అది షోకి తీవ్ర నిరాశే అని చెప్పొచ్చు. మరైతే బిగ్ బాస్ సముదాయించి ప్రేరణాని వెళ్లకుండా చేస్తాడా ? ప్రేరణ నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్నది చూడాలి.  

 


 

google-ad-img