Home

»

Tv News

ఆడిషన్స్  సిద్ధం కండి బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో ఎప్పుడంటే!

May 15, 2026

బుల్లితెర మీద బిగ్ బాస్ అంటే చాలు ఆడియన్స్ కి పండగే పండగ. సమ్మర్ సీజన్ దాటుతోంది వర్షా కాలం వస్తోంది అంటే చాలు ఇక బిగ్ బాస్ ప్రోమోస్ , బిగ్ బాస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ వీళ్ళు వాళ్ళు అంటూ హడావిడి బిగ్ బాస్ ఎలా ఉంది హోస్ట్ ఎవరు  వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేస్తున్నారు సెలబ్రిటీస్ ని ఎవరెవరిని పిలుస్తారు, కామన్ మ్యాన్ ప్లేస్ లో ఎవరెవరు వెళ్తున్నారు ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం.

ఇక లాస్ట్ సీజన్ నుంచి కామన్ మ్యాన్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం కోసం బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ ని స్టార్ట్ చేశారు. అలా లాస్ట్ సీజన్ లో వెళ్లిన వారిలో ఇప్పుడు డీమన్ పవన్, కళ్యాణ్ పడాలా బాగా హైలైట్ అయ్యి రకరకాల షోస్ లో ఎంగేజ్ అయ్యారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 త్వరలో స్టార్ట్ కాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది. అలాగే అగ్ని పరీక్ష సీజన్ 2 లోడింగ్. ఆడిషన్స్ కి సిద్ధం కావాలంటూ బిగ్ బాస్ లేటెస్ట్ అప్ డేట్స్ ని అందిస్తోంది.

ఇక బుల్లితెర సెలబ్రిటీస్ విషయానికి వస్తే లైన్ లో కావ్య శ్రీ, తేజస్వి గౌడ వంటి వాళ్ళను ఆల్రెడీ సంప్రదించినట్టు తెలుస్తోంది. అలాగే వీళ్ళు రకరకాల షోస్ లో కనిపిస్తూనే ఉన్నారు. 2017 లో బిగ్ బాస్ తెలుగు అనేది స్టార్ట్ అయ్యింది. ఇక కరోనా టైములో అందరూ ఇంట్లో ఉండడం లాక్ డౌన్ కారణంగా ఈ షోకి బాగా హైప్ ఐతే వచ్చింది. అలాగే హీరో నాగార్జున మాత్రమే ఈ షోకి హోస్ట్ గా చేస్తున్నారు. ఈ షో మీద ఎన్నో కాంట్రోవర్సీస్ నడుస్తున్నా వాటిని దాటుకుంటూ 9 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు 10 వ సీజన్ లోకి అడుగుపెడుతోంది. మరి ఎవరెవరు వెళ్తారు ఏంటో నెక్స్ట్ అప్ డేట్స్ కోసం వెయిట్ చేయాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com