Home

»

Tv News

దేబ్జానీ మనసులో ముఖేష్ గౌడ.. బిగ్ బాస్ హౌస్‌లో కొత్త లవ్ ట్రాక్!

Sep 14, 2026 9:23AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో మొదటి సండేఫండే  ఎంటర్టైన్మెంట్ గా సాగింది. శనివారం ఎపిసోడ్ లో.. నీ హార్ట్ కి దగ్గరగా ఉన్న వాళ్లు ఎవరు.. దూరంగా ఉన్న వాళ్లు ఎవరు అనే టాస్క్ ని ఆదివారం పూర్తి చేశారు నాగార్జున. ఈ టాస్క్ లో ఇంట్లో అందరికీ దగ్గరైన వారిగా దేబ్జానీ నిలవగా.. అందరికీ దూరంగా ఉన్న వ్యక్తిగా రోహిత్ ఉన్నాడు.

ముఖేష్ గౌడ, దేబ్జానీ మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది. ముఖేష్ నీ కళ్లు చాలా బాగుంటాయని నాగార్జున అనగానే.. మీరు చెప్తుంటే బాగుంది సర్ నమ్మాలని ఉందని ముఖేశ్ అన్నాడు. వెంటనే నాగార్జున.. అంటే దేబ్జానీ చెప్పినప్పుడు నమ్మలేదా అని పంచ్ వేశాడు. దీంతో దేబ్జానీ షాక్ అవుతూ.. అదే కదా సర్ అని అంది.

ఆ తర్వాత దేబ్జానీ ఓపెన్ గానే చెప్పేసింది. నాకు ముఖేష్ అంటే ఇష్టం సర్.. కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చెప్పలేకపోతున్నా. ఇటు సైడ్ పులిహోర చేస్తున్నాడు.. అటు సైడ్ పులిహోర చేస్తున్నాడు.. కానీ నా దగ్గరకు రావడం లేదు సర్ అంటూ అందరి ముందే ప్రపోజ్ చేసినంత పని చేసింది దేబ్జానీ. దీనికి ముఖేష్ కూడా.. నీ కళ్లు కూడా బాగానే ఉంటాయంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు.

బిగ్ బాస్ ఇంట్లో లవ్ ట్రాక్స్ కామన్. కొంతమంది నిజంగానే ప్రేమలో పడతారు. కొంతమంది ఫుటేజ్ కోసం చేస్తారు. ఈ సీజన్-10 లో ఇప్పటివరకు ఏ లవ్ ట్రాక్ సెట్ కాలేదు. ఇప్పుడు దేబ్జానీ, ముఖేష్ గౌడ తో కొత్త ట్రాక్ మొదలైనట్టే అనిపిస్తోంది. ఇది నిజమైన ఇష్టమా లేక బిగ్ బాస్ టీమ్ క్రియేట్ చేసిన ట్రాక్ ఆ అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

 

[Bigg Boss Telugu 10 Debjani Mukesh Gowda love track, Debjani likes Mukesh Bigg Boss 10 promo, Bigg Boss 10 Sunday Funday task, Mukesh Gowda Debjani love story, Star Maa Bigg Boss 10 latest promo]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com