TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Bigg Boss 10 Telugu:కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచిన శివ్.. హౌస్ లోకి కళ్యాణ్ పడాల, దివ్య నిఖిత!

Nov 25, 2026 8:50AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగింది. బడ్డీ అప్ థీమ్‌లో భాగంగా సీజన్-9 కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి టాస్క్ లు ఆడుతున్నారు.  ముందుగా ఇమ్మాన్యుయేల్, సంజనా ఎంట్రీ ఇచ్చారు. వారిద్దరూ కలిసి హౌస్ లోని త్రిగుణ్, రామకృష్ణని ఎంచుకున్నారు.  చివరకు ఇమ్మాన్యుయేల్ - రామకృష్ణ జోడీ ఈ టాస్క్‌లో గెలిచిన రామకృష్ణ కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచాడు. 

ఇక రెండో టాస్క్ కోసం హౌస్ లోకి  కళ్యాణ్ పడాల, దివ్య నిఖిత ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే కూరగాయల బోర్డులు ఇచ్చి కంటెస్టెంట్లకు ట్యాగ్‌లు వేయించారు. త్రిగుణ్ కాకరకాయ చేదు బోర్డును ముఖేష్ మెడలో వేసి ఓడిపోతే తీసుకోలేని మనస్తత్వం అన్నాడు. దీనిపై దివ్య ముఖేష్‌పై ఫైర్ అయ్యింది. నువ్వు ఏం చేస్తావు అంటే నాలో నేను బాధపడతానని ముఖేష్ చెప్పడంతో అందరు షాక్ అయ్యారు. రామ్ ప్రసాద్ బంగాళదుంప - బద్దకం ఎక్కువ, పని తక్కువ బోర్డును నరేష్ మెడలో వేసి నవ్వించాడు. ముకేష్ అమన్‌కి ఒళ్లు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అనే ట్యాగ్ ఇచ్చి రచ్చ చేశాడు.

 

ఆ తర్వాత కళ్యాణ్ శివ్‌కి, దివ్య రామ్ ప్రసాద్‌కి బడ్డీగా ఆడారు. ఈ టాస్క్‌లో కళ్యాణ్ పడాల - శివ్ జోడీ గెలిచారు. దీంతో మరో కెప్టెన్సీ కంటెండర్ గా శివ్ నిలిచాడు.  దీంతో నిన్నటి ఎపిసోడ్ లో ఫైనల్ కెప్టెన్సీ రేసులో రామకృష్ణ, శివ్ నిలిచారు. ఎపిసోడ్ మొదట్లో సుధీర్ 13వ వారంలోకి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వడంపై అందరు ఏడిపించారు. ఎంత కొట్టినా చావని పామువిరా అంటూ సెటైర్లు వేశారు. అమన్ కాఫీ డబ్బా మిస్ అవ్వడంపై శివ్‌తో గొడవ పడ్డాడు. నిన్న ఎక్స్ హౌస్ మేట్స్ రాకతో హౌస్ ఫుల్ సందడిగా మారింది. 

 


 

google-ad-img