.webp)
బుల్లితెర మీద కనిపించే యాంకర్స్ లో ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్నది శ్రీముఖి అంటే అతిశయోక్తి కాదు. ఏ షో ఐనా తనదైన స్టైల్ హోస్ట్ చేస్తూ అందరినీ మెప్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 కి హోస్ట్ చేస్తోంది. ఐతే శ్రీముఖి అంటే ఎంతో ఇష్టం ఉన్న ఒక అభిమాని శ్రీముఖి గురించి బిగ్ బాస్ గురించి రాసిన ఒక మెసేజ్ ని శ్రీముఖి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసింది. ఇంతకు ఆనంద కృష్ణ శ్రీముఖిని వర్ణిస్తూ ఎం రాసారో చూద్దాం.
" శ్రీముఖి! నీతో ఒక విషయం ప్రత్యేకంగా షేర్ చేసుకోవాలని ఉంది. అది నీపై నాకు ఉన్న అభిమానం, ఆప్యాయత గురించి. బిగ్‌బాస్ సీజన్స్ మొదలైనప్పుడు నాకు వాటిని చూడాలనేంత ఇంటరెస్ట్ ఎప్పుడూ రాలేదు. కానీ సీజన్ 3 స్టార్ట్ ఐన ఆ రోజు నువ్వు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నేను ఆ షో చూడటం మొదలుపెట్టాను. నిజం చెప్పాలంటే, నేను ఆ సీజన్‌ను ప్రత్యేకంగా నీ కోసమే చూశాను. వేరే కంటెస్టెంట్స్ కోసమో కానీ పరిచయం ఉన్న వాళ్ళ కోసం కానీ కాదు. ఇప్పటికీ నీ ఎంట్రీ నాకు గుర్తుంది. నువ్వు 13వ కంటెస్టెంట్‌గా స్టేజ్‌పైకి వచ్చావు. “దిమాక్ ఖరాబ్”, “ఒసేయ్ రాములమ్మ” వంటి పాటలతో, ఆ అద్భుతమైన రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్‌లో స్టేజ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చావు. అందరూ ఒక్కొక్కరుగా హౌస్ లోకి వెళ్లారు. కానీ బిగ్‌బాస్ హౌస్ రూల్స్‌ను మొదట చదివింది నువ్వేనని కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది.
అలా ఒక్కో ఎపిసోడ్ చూస్తూ వస్తున్నప్పుడు మూడో వారానికి వచ్చేసరికి నా మనసుకి అర్థమైపోయింది నువ్వే నా ఫేవరెట్ కంటెస్టెంట్ అని. ముఖ్యంగా డంబెల్ టాస్క్ సమయంలో దాదాపు మొత్తం హౌస్ నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా నువ్వు చూపించిన ఎమోషనల్ గా మెంటల్ గా నువ్వు చూపించిన తెగువా నాకు నచ్చినా.. ఎవ్వరూ నీ మనోధైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు. నిజంగా అప్పుడే నేను నీ అభిమానిని అయ్యాను.
మొదటి రోజు నుంచి షో చివరి రోజు వరకు బిగ్‌బాస్ పట్ల నీకు ఉన్న ప్రేమ, ప్యాషన్, అంకితభావం ప్రతి ఎపిసోడ్‌లో కనిపించాయి. దాంతో నీ పట్ల నా మనసులో అయితే ఒక ప్రత్యేకమైన భావన ఏర్పడింది. “బిగ్‌బాస్ అంటే శ్రీముఖి” అని. అంతగా నువ్వు నా మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నావు. షోలో నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ల విషయంలో నువ్వు ఎప్పుడూ నెగటివ్ గా చెప్పలేదు. తర్వాత జరిగిన బజ్ ఇంటర్వ్యూలలో నువ్వు ఎంతో మెచ్యూరిటీతో, వారి గురించి మంచి మాటలే మాట్లాడావు. అది నీలో ఉన్న మంచితనాన్ని, పరిపక్వతను చూపించింది. నీ జీవితంలో, కెరీర్‌లో లేదా అగ్నిపరీక్ష విషయంలో ఎలాంటి సవాళ్లు, విమర్శలు లేదా మాటలు ఎదురైనా వాటిని నువ్వు ఎంతో ధైర్యంగా తీసుకుని ముందుకు సాగావు. కొంతమంది కంటెస్టెంట్లపై మనకు ఉన్న అభిమానం క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. కానీ 2019 నుంచి నీపై నాకు ఏర్పడిన అభిమానం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. ఇక ముందు కూడా ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎందుకంటే నువ్వు నా మనసులో సంపాదించుకున్న స్థానం అలాంటిది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు ఎవరితోనూ అమానవీయంగా ప్రవర్తించవని నేను నమ్ముతాను.
చివరిగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను… నువ్వు మా ఇంటి బంగారం శ్రీముఖి! నీకు మరింత శక్తి, మరింత విజయం రావాలి. ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ, మెరిసిపోతూ, అందరి ప్రేమను పొందుతూ ఉండాలి. ఎప్పుడూ ఇలాగే బంగారంలో నీ శక్తితో మెరిసిపోవాలని కోరుకుంటున్నాను " అంటూ ఒక సుదీర్ఘమైన మెసేజ్ ని పంపించారు.






