బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 అనేది బిగ్ బాస్ తెలుగు-10 కి వెళ్లేందుకు ముందు జరిగే ప్రీ-షో. ఈసారి లక్షల అప్లికేషన్ల నుంచి 5 లెవెల్స్ లో ఫిల్టర్ చేసి ఫైనల్ గా 15 మంది కామనర్స్ ను సెలెక్ట్ చేశారు. JioHotstar మరియు Star Maa లో ఆగస్టు 15 నుంచి ప్రసారం అవుతున్న ఈ షోని గత సీజన్ లాగే శ్రీముఖి హోస్ట్ చేస్తుండగా.. జడ్జ్ లుగా అభిజిత్, బిందు మాధవి, నవదీప్ వ్యవహరిస్తున్నారు.
ఈ సీజన్ సెలక్షన్ ప్రాసెస్ చాలా టఫ్ గా ఉంది. లెవల్-1 లో వీడియో బేస్డ్ స్క్రీనింగ్ తో 200 మందిని సెలక్టు చేశారు. లెవల్ 2 లో ఫోన్ ఇంటర్వ్యూ తో 150 మందిని సెలెక్ట్ చేయగా లెవల్ 3 లో గ్రూప్ డిస్కషన్ తో 70 మందిని సెలెక్ట్ చేశారు. లెవల్ 4 లో జడ్జ్ లు డైరెక్ట్ ఇన్-పర్సన్ ఇంటర్వ్యూ చేసి టాప్-15 ను ఫైనల్ చేశారు. ఈ పదిహేను మందే ఇప్పుడు అగ్నిపరీక్ష హౌస్ లో ఉన్నారు.
ఫైనల్-15 లో యాంకర్ ప్రియా, సింగర్ ఝాన్సీ, షాలినీ, శ్రష్టి, భాగి, అపూర్వ, గాయత్రి, రోహిత్, అమన్, హేమంత్, మిథిలేష్, చరణ్, దీపక్, రామకృష్ణ వంటి వారు ఉన్నారు. వీరికి ప్రతిరోజూ స్ట్రెంత్, ఎండ్యూరెన్స్, మెంటల్ స్ట్రెంత్, టీమ్ వర్క్ వంటి టాస్కులు పెడుతున్నారు. ప్రతి టాస్క్ తర్వాత MVP, BEST, WORST, Yellow Card, Green Card లాంటి పవర్ కార్డులతో జడ్జ్ మెంట్ ఉంటుంది.
ఈ పదిహేను మందిలో నుంచి చివరకు కేవలం అయిదుగురు మాత్రమే బిగ్ బాస్ తెలుగు సీజన్-10 మెయిన్ హౌస్ లోకి కామనర్స్ గా ఎంట్రీ ఇస్తారు. అక్కడ వారు సెలబ్రిటీలతో కలిసి టైటిల్ కోసం పోటీపడతారు. అందుకే అగ్నిపరీక్షను కేవలం ప్రీ-షో అని కాకుండా బిగ్ బాస్ కి ఫస్ట్ స్టెప్ అని చెబుతున్నారు.
[Bigg Boss Agnipariksha 2 Overall, Agnipariksha Season 2 Concept, Sreemukhi Host Agnipariksha 2, Abhijeet Bindu Madhavi Navdeep Judges, Agnipariksha Top 15 Contestants List, JioHotstar Bigg Boss Telugu 10 Selection Process]




