Home

»

Tv News

Bigg Boss Season-10 Telugu: హార్ట్ కి దగ్గర ఎవరు? హార్ట్ కి దూరంగా ఎవరంటే!

Sep 14, 2026 9:35AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో సండే ఫండే రోజు.. హార్ట్ కి దగ్గర, హార్ట్ కి దూరం అనే టాస్క్ ని నాగార్జున మళ్ళీ స్టార్ట్ చేశారు. శనివారం సగంలో ఆగిన టాస్క్ ని ఆదివారం కంటిన్యూ చేశారు. ప్రతి ఒక్కరూ స్టేజ్ మీదకు వచ్చి తమ మనసుకు దగ్గరైన వాళ్లు ఎవరు, దూరం అయిన వాళ్లు ఎవరు అనేది క్లియర్ గా చెప్పాల్సి వచ్చింది.

మొదట అమన్ వచ్చాడు. అమన్ దేబ్జానీని దగ్గరగా.. షాలినీని దూరంగా పెట్టాడు. ఆ తర్వాత రాంప్రసాద్ కూడా అదే మాట చెప్పాడు. దేబ్జానీ దగ్గర, షాలినీ దూరం అన్నాడు. రాంప్రసాద్ షాలినీ గురించి మాట్లాడుతూ.. ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు మీ కామెడీ అంటే ఇష్టమని చెప్పింది, కానీ నెక్స్ట్ డే నే ఐ యామ్ నాట్ టాకింగ్ టు యూ అని చెప్పిందని అన్నాడు. దీనికి నాగ్ .. ఆ మాటలకు నిద్ర పోలేదేమో కదా అని అన్నాడు. కృష్ణుడు వచ్చి దేబ్జానీ దగ్గర, రోహిత్ దూరం అన్నాడు. ముఖేష్ గౌడ ఝాన్సీ దగ్గర, రోహిత్ దూరం అన్నాడు. నరేష్ దేబ్జానీ దగ్గర, శ్రిష్టి దూరం అన్నాడు. సుధీర్ ముఖేష్ దగ్గర, వర్షిణి దూరం అన్నాడు. వంశీ రోహిత్ దగ్గర, సుధీర్ దూరం అన్నాడు.

అందరి ఒపీనియన్ విన్న తర్వాత ఒక విషయం క్లియర్ అయింది. దేబ్జానీకి హౌస్ లో అందరి నుంచి పాజిటివ్ ఓట్లు వచ్చాయి. తెలుగు రాకపోయినా కూడా ప్యూర్ హార్ట్ తో మాట్లాడుతుందని అందరు మెచ్చుకున్నారు. రోహిత్ కి మాత్రం నెగెటివ్ ఓట్లు ఎక్కువ వచ్చాయి. యాక్సెప్టెన్స్ లేదు, యారోగెన్సీ గా మాట్లాడతాడు, నోరు జారతాడంటూ ముఖేష్ కామెంట్ చేశాడు. దీంతో నాగార్జున రోహిత్ కి..‌కాస్త చూసుకో రోహిత్, అందరికి దూరం అవుతున్నావంటూ నాగార్జున చెప్పాడు.

 

 

[Bigg Boss 10 heart close heart far full list, Debjani close to heart majority, Rohit far from heart Bigg Boss 10, Ram Prasad Shalini fight, Bigg Boss Telugu 10 Day 7 task opinions]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com