ఆ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్‌ని మూవీలోకి తీసుకోలేదు!
on Aug 19, 2022
'ఆలీతో సరదాగా' షో ఆడియన్స్ కి తెలియని ఎన్నో విషయాలను చెప్తుంది. ఇక ఇప్పుడు ఈ షోకి వచ్చిన సీనియర్ నిర్మాత అశ్వని దత్ కూడా ఎన్నో విషయాలను పంచుకున్నారు. 'మహానటి' మూవీ గురించి అందులో ఎవరూ నటించని సీనియర్ ఎన్టీఆర్ రోల్ గురించి అశ్వనీదత్ ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మహానటి' మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మహానటి సావిత్రి పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసింది అలాగే జెమిని గణేశన్ పాత్రలో మలయాళ యాక్టర్ దుల్కర్ సల్మార్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగచైతన్య, మధురవాణి పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత, విజయ్ ఆంటోనీ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు.
ఇక ఈ మూవీలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో మాత్రం ఎవరూ నటించలేదు. మరి ఆయన పాత్రలో జూనియర్ ఎన్టీయార్ నటిస్తే బాగుంటుందని అప్పుడు ఆడియన్స్ అనుకున్నారు. ఐతే మరి జూనియర్ ఎన్టీఆర్ ని నటింపచేద్దామనుకునే టైంకి బాలయ్య బాబు ఎన్టీఆర్ బయోపిక్ మూవీని ప్రకటించారు. ఇక ఇలాంటి టైంలో జూనియర్ ఎన్టీఆర్ ని పెడితే బాగోదని భావించి డైరెక్టర్ తో చెప్తే ఆర్కైవ్స్ ఫుటేజ్ షాట్ తో చేసేద్దాం అని చెప్పారు. అందుకే 'మహానటి'లో ఎక్కువగా నాగేశ్వరావు పాత్ర ఫోకస్ అయ్యింది అని చెప్పారు. లేదంటే జూనియర్ ఎన్టీఆర్ తప్పనిసరి తాత రోల్ లో నటించేవారని ఆయన వెల్లడించారు.