.webp)
సోషల్ మీడియా అష్షు రెడ్డి ఎంగేజ్మెంట్ జరిగిందని డబ్బు తీసుకుని మోసం చేసిందన్న న్యూస్ చాలా వైరల్ అయ్యింది. ఐతే రీసెంట్ గా అష్షు రెడ్డి ఆ కామెంట్స్ కి తెరదించుతూ ఒక ఎంగేజ్మెంట్ పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఐతే అందులో ఒక అబ్బాయి చేయి అలాగే తన చేతికి ఒక ఎంగేజ్మెంట్ రింగ్ తో ఉన్న పిక్ ఒకటి, అలాగే సోఫా మీద కూర్చుని తన్మయత్వంతో ఎంగేజ్మెంట్ రింగ్ ని చూసుకుంటూ ఉన్న పిక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.
ఒక పక్కన కోర్ట్ లో ఈమె మీద కేసు నడుస్తుంటే మరో పక్క అష్షు అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఈ పిక్స్ ని పోస్ట్ చేసింది. ఐతే ఈ పిక్స్ కి కామెంట్స్ సెక్షన్ ని డిజేబుల్ చేసింది అలాగే ఎప్పుడూ కాప్షన్ పెట్టె చోట ఒక కెమెరా పిక్ పెట్టింది తప్ప ఏమీ పోస్ట్ చేయలేదు. దీంతో ఈ పిక్స్ కింద కామెంట్స్ లేవు. ఐతే అష్షు రెడ్డి నిఖిల్ మలయక్కల్ తో కలిసి విక్రమ్ ఆన్ డ్యూటీ అనే వెబ్ సిరీస్ చేసింది. డిస్నీ హాట్ స్టార్ లో అది స్ట్రీమ్ అవుతోంది. ఐతే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పిక్స్ ఇవా వెబ్ సిరీస్ లో నిఖిల్ తో కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్న పిక్స్ ని పోస్ట్ చేసిందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇక నెటిజన్స్ ఐతే ఏ అబ్బాయి చేయి అది ..? అష్షు ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది అసలు ? చేసుకుంటోందా లేదా వెబ్ సిరీస్ పిక్స్ తో ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి పోస్ట్ చేసిందా అసలు ఎం జరిగింది ఎం జరుగుతోంది ఎం జరగబోతోంది అంటూ ఆరా తీస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో అష్షు రెడ్డి నిఖిల్ కి గర్ల్ ఫ్రెండ్ రోల్ లో నటిస్తోంది. ఇంతకు ఈ ఎంగేజ్మెంట్ వెనక స్టోరీ తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.





