అసలు కామన్ సెన్స్ ఉందా...ఈ షో చైర్మన్ ని ఇలాగేనా గౌరవించేది!
on Dec 3, 2022
కామెడీ స్టాక్ ఎక్స్చేంజి కలర్ ఫుల్ గా స్టార్ట్ అయ్యింది.
ఇక ఈ షో చైర్మన్ అనిల్ రావిపూడి ఎంట్రీ ఫుల్ కామెడీగా ఉంది. అనిల్ ఎంట్రీకి చుటూ బౌన్సర్లు వచ్చి నిలబడ్డారు. కానీ వాళ్లంతా ముందుకు వెళ్ళిపోయి అనిల్ రావిపూడిని వెనకే నిలబెట్టేస్తారు. దాంతో సుధీర్ వచ్చి "ఏమిటి సర్ ఇక్కడే ఆగిపోయారు..రండి" అనేసరికి "చేసుకో నువ్వే చేసుకో షో ఆ బౌన్సర్స్ ని పెట్టుకుని..రెడ్ కార్పెట్ మీద నేను వచ్చేలోపే బౌన్సర్లు ముందు వెళ్ళిపోతే ఇంకా నేను ఎందుకు..అసలు కామన్ సెన్స్ ఉందా నీకు...నేను ఈ షో చైర్మన్ ని కదా ఇలాగేనా నన్ను గౌరవించేది..అసలు ఏం ప్లానింగ్ ఇది..నువ్వే కదా ఈ స్కెచ్ అంతా వేసింది. టేకాఫ్ లోనే నన్ను తొక్కేస్తే షో మొత్తం నువ్ కేప్చర్ చేయొచ్చు అని అనుకుంటున్నావు కదా...చూస్తా నీ సంగతి" అనేసరికి సుధీర్ అలా ఏమీ లేదని చెప్పి ఇద్దరూ ఫన్ క్రియేట్ చేసాడు.
తర్వాత అనిల్ రావిపూడిని ఖిలాడీ సాంగ్ తో షోలోకి ఇన్వైట్ చేసాడు హోస్ట్ సుధీర్.
Also Read