Home

»

Tv News

Agnipariksha season 2 : గేమ్ కోసం జుట్టు కట్ చేయించుకున్న భాగి.. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో సంచలనం

Aug 21, 2026 10:01AM

బిగ్ బాస్ సీజన్ 10 లో కంటెస్టెంట్స్ కోసం సాగుతున్న అగ్నిపరీక్ష సీజన్ 2 హోరాహోరీగా ఉంది. ఒక్కో కంటెస్టెంట్ నువ్వా నేనా అన్నట్టుగా టాస్క్ లు ఆడుతున్నారు.  నిన్నటి ఎపిసోడ్ లో..భాగి హెయిర్ కట్ టాస్క్‌తో అందరి దృష్టిని లాగేసుకుంది. అబ్బాయిలా కటింగ్ కొట్టించుకోవాలని ఫోటోలు చూపించగానే ఒక అమ్మాయి వెనక్కి తగ్గింది. కానీ భాగి మాత్రం  తగ్గేదేలే  అన్నట్టు ముందుకు దూకింది. ముందు బెల్ పట్టుకునే చిన్న టాస్క్‌లో గెలిచి హెయిర్ కట్ చేసుకునే ఛాన్స్ ని సొంతం చేసుకుంది. నవదీప్ కట్ చేస్తాడేమో అనుకున్నారు కానీ చివరకు ప్రొఫెషనల్ స్టైలిష్ట్ వచ్చి అబ్బాయిలా చిన్నగా కట్ చేసి వెళ్లిపోయాడు.

 

నిజం చెప్పాలంటే అమ్మాయిలు హెయిర్ విషయంలో చాలా సెన్సిటివ్ గా ఉంటారు. కానీ భాగి మాత్రం గేమ్ కోసం, టాప్ 15 కోసం ఏదైనా చేయడానికి రెడీ అని ప్రూవ్ చేసింది. స్టేజ్ మీద కూర్చుని కట్ చేయించుకుంటున్నప్పుడు కూడా ఫేస్ లో టెన్షన్ లేదు. పైగా ధైర్యంగా నవ్వుతూనే ఉంది. గేమ్ అంటే రిస్క్ తీసుకోవాల్సిందే అన్నట్టు ఆమె బాడీ లాంగ్వేజ్ చెప్పింది. అందుకే హోస్ట్స్ కూడా ఆమె కమిట్మెంట్ ని మెచ్చుకున్నారు.

 

ఆ ఒక్క హెయిర్ కట్ టాస్క్ తోనే భాగి డైరెక్ట్‌గా టాప్ 15 బెర్త్ కన్ఫమ్ చేసుకుంది. ఇప్పుడు టాప్-15లో మొత్తం 7 మంది ఉన్నారు. అందులో భాగి కూడా ఒకరు. బయట నుంచి చూస్తే  జస్ట్ కటింగ్ కదా  అనిపించొచ్చు, కానీ ఆ క్షణంలో ఆమె చూపించిన తెగింపు వల్లే ఆమెకు స్థానం వచ్చింది. రేపు మిగిలిన 8 మంది సెలెక్ట్ అవుతారు, కానీ భాగి ఆల్రెడీ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com