
'అత్తరు సాయిబో రారా' అనే జానపద గీతం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎప్పటినుంచో జనాల్లో ఉన్న ఈ పాట 1998లో వచ్చిన 'ఆల్‌రౌండర్' సినిమాతో మరింత పాపులర్ అయింది. రాజేంద్ర ప్రసాద్, సంఘవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి టి. ప్రభాకర్ దర్శకత్వం వహించారు. సూర్య తేజ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన సినిమాకు వీణాపాణి సంగీతం అందించారు.
'ఆల్‌రౌండర్' సినిమాలోని 'అత్తరు సాయిబో రారా' పాట అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలోనూ ఈ సాంగ్ హవా మామూలుగా లేదు. అయితే ఈ సాంగ్ ఎంత హైలైట్ అయిందో.. ఇందులో రాజేంద్ర ప్రసాద్ పెర్ఫార్మెన్స్ కూడా అంతే హైలైట్ అయింది. రాజేంద్ర ప్రసాద్ గెటప్, డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి.
ఫుల్ లిరిక్స్:
అత్తరు సాయిబో రారా
అందగాడా రారా
అత్తరు సాయిబు
అత్తరు సాయిబు
అత్తరు సాయిబు బాగుండమ్మా చూపుకునచ్చిండే
అత్తరు సాయిబు బాగుండమ్మా చూపుకునచ్చిండే
చూపులతోనే గుండెలోమెత్తని సూదులుగుచ్చిండే
అత్తరు సాయిబో రారా
నా అందగాడా రారా
మిస్ వరల్డ్లో కప్పును తెస్తూ మిసయ్యి తిరిగొచ్చా
మిస్ వరల్డ్లో కప్పును తెస్తూ మిసయ్యి తిరిగొచ్చా
అక్కడ చూపని అందం ఒకటి
నీకే చూపిస్తా
అత్తరు సాయిబో రారా
నా అందగాడా రారా
బంగరుకోటు దుబాయ్ సేటు చెయ్యే పట్టిండు
బంగరుకోటు దుబాయ్ సేటు చెయ్యే పట్టిండు
ఆజా బుల్ బుల్ దుబాయిలేపుకు
పోతానంటుండు
అత్తరు సాయిబో రారా
నా అందగాడా రారా
అందరు మొగుళ్ళు PHD చేసి డాక్టర్లవుతుంటే
అందరు మొగుళ్ళు PHD చేసి డాక్టర్లవుతుంటే
PHD చేసిన నా మొగుడు
పీతలు పడుతుండే
అత్తరు సాయిబో రారా
నా అందగాడా రారా
అందరు మొగుళ్ళు బెజవాడెళ్ళి బిజినెస్ పెడుతుంటే
అందరు మొగుళ్ళు బెజవాడెళ్ళి బిజినెస్ పెడుతుంటే
బెజవాడెళ్ళిన నా మొగుడు
బేవార్స్ అయ్యిండే
అత్తరు సాయిబో రారా
నా అందగాడా రారా
అందరు మొగుళ్ళు పిల్లలు లేరని పూజలు చేసొస్తే
అందరు మొగుళ్ళు పిల్లలు లేరని పూజలు చేసొస్తే
పిల్లలు లేరని నా మొగుడు
నెలతప్పి వచ్చిండే
అత్తరు సాయిబో రారా
నా అందగాడా రారా
[Attaru Saibo Raara Song Lyrics Telugu, Attaru Saibo Raara Full Song, Attaru Saibo Raara, All Rounder Movie Songs, Telugu Folk Songs, Trending Song]





