Home

»

Latest News

Toxic: టాక్సిక్ మిస్టరీ.. లేట్ అవ్వడానికి అసలు కారణం ఇదేనా!

Apr 28, 2026

 

ఎంత అర్ధం చేసుకోవాలని అనుకున్నా కొన్ని రహస్యాలు ఎవరకి అర్ధం కానీ పరిస్థితి. యష్ (Yash)వన్ మాన్ షో 'టాక్సిక్'(Toxic)పరిస్థితి కూడా అంతే.కేజీఎఫ్' సిరీస్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, గత కొంతకాలంగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో జరుగుతున్న మార్పులు అభిమానులకి ఆందోళనకి గురిచేస్తున్నాయి. మొదట మార్చిలో రావాల్సిన ఈ సినిమా, తర్వాత జూన్ 4కి వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.  

తాజా సమాచారం ప్రకారం, మూవీ లేట్ అవ్వడానికి కేవలం టెక్నికల్ కారణాలే కాకుండా, ఓటీటీ డీల్ కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా ఏ పెద్ద సినిమాకైనా షూటింగ్ దశలోనే డిజిటల్ రైట్స్ అమ్ముడవుతాయి. కానీ, టాక్సిక్ విషయంలో డీల్ ఇంకా క్లోజ్ కాలేదని, అందుకే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించడానికి తటపటాయిస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరోవైపు, కేవలం ఓటీటీ మాత్రమే కాకుండా సినిమా అవుట్‌పుట్ విషయంలో కూడా యష్ అంత సంతృప్తిగా లేరని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని భారీ VFX సీక్వెన్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో క్వాలిటీ తగ్గకుండా ఉండాలని యష్ పట్టుబడుతున్నారట. ఒకవేళ  మార్చిలోనే విడుదల కావాల్సి ఉంటే, అప్పటికే ఓటీటీ డీల్ పూర్తి కావాలి. కానీ ఏప్రిల్ చివరలో ఉన్నా ఇంకా దీనిపై స్పష్టత రాలేదు.

 
also read: Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద మళ్ళీ మెగా విధ్వంసం ఖాయం.. ది సైలెన్స్ బిఫోర్ స్లాటర్

గతంలో సినిమా వాయిదా పడినప్పుడు.. గల్ఫ్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఓవర్సీస్ మార్కెట్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో రిలీజ్ ఆపినట్టుగా వార్తలు వచ్చాయి.  ఇప్పుడు వరుసగా మారుతున్న సమీకరణాలు చూస్తుంటే, కేవలం బాహ్య కారణాలే కాకుండా అంతర్గతంగా నిర్మాణ పనుల్లో  జాప్యం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏది ఏమైనా యష్ టాక్సిక్ లేటు కావడం ఫ్యాన్స్, మూవీ లవర్స్ కి రహస్యంగానే ఉంది.
  

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com