Home

»

Latest News

చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్!

Oct 14, 2026 6:46PM

 

టాక్సిక్ తో పరాజయాన్ని అందుకున్న యష్ నవంబర్ 6 న 'రామాయణ'తో రాబోతున్నాడు. ప్రధాన రోల్ రావణుడు కావడంతో అభిమానులు, ప్రేక్షకుల్లో రావణుడిగా ఎలా మెస్మరైజ్ చేయబోతున్నాడనే ఆసక్తి ఏర్పడింది.  అయితే  'టాక్సిక్' అనుభవం నుంచి యష్ ఏమాత్రం పాఠాలు నేర్చుకోవడం లేదంటూ  జోరుగా చర్చ సాగుతోంది.


 ఫ్యాన్స్ మనోభావాలను, మార్కెట్ అంచనాలను పక్కనపెట్టి మళ్ళీ ఫ్లాప్ ట్రాక్‌లో ఉన్న దర్శకులతో తదుపరి చిత్రాలకి యష్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కార్తీ నుంచి వచ్చిన 'సర్దార్ 2' వంటి డిజాస్టర్ చిత్రాన్ని అందించిన పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో యష్ తన తదుపరి సినిమా చేయబోతున్నారనే ప్రచారం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఏరికోరి మరీ ఫ్లాప్ డైరెక్టర్లతో సినిమాలు చేయడం ఎందుకంటూ యష్ స్వయంగా అభిమానులే సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిట్ డైరెక్టరే హిట్ ఇస్తాడని, ఫ్లాప్ డైరెక్టర్ మళ్ళీ ఫ్లాపే తీస్తాడనే రూల్ లేకపోయినా, ప్రస్తుతం యష్‌కు కావాల్సింది మంచి బూస్టప్ ఇచ్చే క్రేజీ ప్రాజెక్ట్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.


 ఇది కూడా చదవండి: 'ది ఒడిస్సీ' ఓటీటీ డేట్ వచ్చిందోచ్.. కానీ పరిస్థితి ఇదే!

 

 

గీతు మోహన్‌దాస్ విషయంలోనూ ఇదే పునరావృత్తమైంది. పెద్దగా కమర్షియల్ ట్రాక్ రికార్డ్ లేని దర్శకురాలిని నమ్మి యష్ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను అప్పగించారు. ఫలితంగా సినిమా ప్రొడక్షన్ మూడు సంవత్సరాలకు పైగా సాగి, ఎన్నో వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చి  నిరాశపరిచింది. అందుకే పి.ఎస్. మిత్రన్‌తో మూవీ వార్తలు అభిమానుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. 

  

[Yash And Ps Mithran Movie Details, Yash next movie, Toxic movie result, PS Mithran Yash, KGF Yash news, Sandalwood cinema updates, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com