OGనే కాదు హరిహర వీరమల్లు కూడా!
on Feb 4, 2023
నేటి రోజుల్లో సినిమా నిడివి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటే ఆయా చిత్రాలను తమ సత్తాతో రెండు భాగాలుగా విడుదల చేయడంలో కొందరు దర్శక నిర్మాతలు విజయం సాధిస్తున్నారు. కమలహాసన్ విశ్వరూపం, రాజమౌళి బాహుబలి వంటివి దీనికి ఉదాహరణ. ఇంకా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ తాజాగా సుజీత్ దర్శకత్వంలో ఓ జి అనే సినిమాలు స్టార్ట్ చేశారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోందని వార్తలు వస్తున్నాయి.
మొదటి భాగం దసరా కానుకగా అక్టోబర్ 23న విడుదల కానుందని సమాచారం అందుతుంది. అయితే ఇది నిజమో కాదో తెలియదు. అంతలోనే పవన్ వైపు నుంచి మరో షాకింగ్ అప్డేట్ బయట వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాతగా హరిహర వీరమల్లు అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మొగలుల కాలం నాటి పీరియాడికల్ ఫిలిం కావడంతో ఈ చిత్రం ఆలస్యం అవుతూ వస్తోంది. కొంతకాలం కరోనా, మరి కొంతకాలం పవన్ రాజకీయాలలో బిజీగా ఉండడం, భారీ బడ్జెట్ చిత్రం కావడం, పాన్ ఇండియా మూవీగా పవన్ నటిస్తున్న తొలి చిత్రం కావడం.... ఇలా పలు కారణాలవల్ల ఈ చిత్రంషూటింగ్ వాయిదా పడుతూనే ఉంది. సినిమా షూటింగ్ పూర్తి కావస్తోందని వార్తలు వచ్చాయి. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం లేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పండుగలు సాయన్న అనే బందిపోటు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. టీజర్ వచ్చేస్తోందని, సినిమా దాదాపు కంప్లీట్ అయిందని వార్తలు తప్ప ఎలాంటి అప్డేట్స్ లేవు.
తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం హరిహర వీరమల్లు చిత్రం కూడా రెండు భాగాలుగా రానుందని సమాచారం. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. అదే నిజమైతే పీకే ఫ్యాన్స్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చేసినట్లే. ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రంపై క్రిష్ విడుదల చేసిన కొన్ని వీడియోల వల్ల సినిమా మీద ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగాయి. కీరవాణి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ దీనికి మరో ఆకర్షణ కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత కీరవాణి సంగీతం అందిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు.
Also Read