Home

»

Latest News

'వైల్డ్'గా మారిన సీనియర్ యాక్టర్..!

Apr 30, 2026

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రాజా రవీంద్ర (Raja Ravindra) ప్రధాన పాత్రలో "వైల్డ్" (Wild) అనే సినిమా రాబోతోంది. వయోలెంట్ సైకో థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ సాయిరాం దాసరి రూపొందించనున్నారు. ఈ చిత్రాన్ని ఓవా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ రవి పీట్ల  నిర్మించనున్నారు.

త్వరలో "వైల్డ్" మూవీ లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుని రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ చిత్ర అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. "వైల్డ్" మూవీ మోషన్ పోస్టర్ లో రక్తంతో తడిసిపోయిన వయలెంట్ లుక్ లో రాజా రవీంద్ర కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు

కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారి సినిమాలు చేయడం చూస్తున్నాం. మరి రాజా రవీంద్ర మెయిన్ లీడ్ గా చేస్తున్న ఈ 'వైల్డ్' మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com