Home

»

Latest News

ఎవరు ఈ ఆనంది: గరివిడి లక్ష్మి తో మోత మోగిస్తూ ఉంది!

Oct 17, 2026 2:49PM

 

గరివిడి లక్ష్మి సెల్యులాయిడ్ పై అలా అడుగుపెట్టిందో లేదో ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట ఆనంది పేరు మారుమోగిపోతూ ఉంది. గరివిడి లక్ష్మి జీవితానికి  సంబంధించి జరిగిన అన్ని వేరియేషన్స్ లోను అత్యద్భుతంగా పెర్ఫార్మ్ చేసిందనే కితాబుని అందుకోవడంతో అందరూ సోషల్ మీడియా వేదికగా ఆనంది డిటైల్స్ గురించి సెర్చ్ చెయ్యడం స్టార్ట్ చేశారు.


 ఆనంది ది తెలంగాణలోని వరంగల్‌.2012లో మారుతి దర్శకత్వంలో వచ్చిన 'బస్ స్టాప్' చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2014లో తమిళంలో ప్రఖ్యాత దర్శకుడు ప్రభు సోలమన్ తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందిన 'కాయల్' చిత్రం ఆమె కెరీర్‌ని  మలుపు తిప్పింది. ఆ సినిమాలో కాయల్‌విజిగా చూపించిన నటనతో 'కాయల్ ఆనంది'గా సినీ ప్రియుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.   ఆ తర్వాత తమిళంలోనే పరియేరుమ్ పెరుమాళ్','ఇరండమ్ ఉలగపోరిన్ కడైసి గుండు' కూడా మంచి గుర్తింపు తెచ్చాయి. తెలుగులో ప్రశంసలు పొందిన ' జాంబి రెడ్డి' (2021), 'శ్రీదేవి సోడా సెంటర్' (2021), 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' (2022) వంటి చిత్రాల్లో ఆమె పోషించిన క్యారెక్టర్స్  ఆనందిని సరికొత్త కోణంలో ఆవిష్కరించాయి. 

 ఇది కూడా చదవండి: గరివిడి లక్ష్మి హైలెట్స్ ఇవే:  ఉత్తరాంధ్ర కళాకారులల్లోనే క్వీన్!

 

 

ఇప్పుడు  'గరివిడి లక్ష్మి' ఆమె కెరీర్ ని మరింత ముందుకు తీసుకొచ్చింది.  కొంత ముందైతే మహానటి తో కూడా పోలుస్తున్నారు. దీన్ని బట్టి గరివిడి లక్ష్మి గా ఎంతలా మెస్మరైజ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఆనంది జీవించేసిందని సమీక్షకులు కొనియాడుతున్నారు. వేదికపై జానపద కళాకారిణిగా చూపించాల్సిన శక్తివంతమైన హావభావాలు, గొంతులో పలికించాల్సిన పౌరుషం, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, కష్టనష్టాల ఎమోషనల్ సీన్లలో ఒక రేంజ్ పెర్ఫార్మ్ అని కూడా అంటున్నారు.  కళని ఆయుధంగా మలచుకుని పోరాడిన వీరనారి గాథలో ఆనంది నటన ఆమె సినీ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయిందనడంలో సందేహం లేదు.

 

[Who Is Garividi Lakshmi Anandhi, Garividi Lakshmi Movie Review Telugu, Garividi Lakshmi Movie Review, Anandhi Garividi Lakshmi Biopic, Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com