
'డీసీ' మూవీ సాధించిన ఘన విజయం తెలిసిందే. తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా రికార్డు కలెక్షన్స్ సృష్టించి కంటెంట్ బాగుంటే మిగతా 'షో' ప్రాపర్టీస్ అక్కర్లేదని నిరూపించింది. ఇక ఈ చిత్రం ద్వారా లోకేష్ కనగరాజ్ కి ఎంత పేరు వచ్చిందో, వామికా గబ్బీకి కూడా అంతే పేరు వచ్చింది. దీంతో ఈ భామ రాబోయే సినీ జర్నీ ఒక రేంజ్ లో ఉండబోతుంది.
ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే కాక పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ తో దూసుకుపోతున్న సూర్య తన 47వ సినిమాని 'ఆవేశం' ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ తర్వాత 'జై భీమ్' చిత్ర దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్‌లో ఆయన 48వ సినిమా పట్టాలెక్కనుంది. ఇక దీని తరువాత, పవర్‌ఫుల్ అండ్ విభిన్నమైన యాక్షన్ చిత్రాల దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వంలో సూర్య తన 49వ (Suriya 49) చిత్రాన్ని చేయనున్నారు. సరిగ్గా ఈ హెచ్. వినోద్, సూర్య కలయికలో రూపుదిద్దుకోనున్న క్రేజీ ప్రాజెక్ట్‌లోనే వామికా గబ్బీ ప్రధాన కథానాయకిగా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది.
.webp)
Also Read: యష్ ఫ్యాన్స్ హంగామా: టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ కి ఊహించని కలెక్షన్స్
చండీగఢ్‌కి చెందిన వామికా దాదాపు 19 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతోంది. ఈ 19 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, పంజాబీ వంటి వివిధ భాషల్లో కలిపి సుమారు 30కి పైగా చిత్రాల్లో నటించి తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే, అన్ని సినిమాల్లో చేసినప్పటికీ రావలసిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. ఇప్పుడు డిసి తన రూట్ మార్చేసింది.
[Wamiqa Gabbi, Dc, Suriya, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]






