TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

వృషకర్మ vs అలియాస్ రుక్మిణి: భయాలేమి పెట్టుకోవద్దు: ఎంజాయ్ చేయండి!

Nov 28, 2026 6:14PM

డిసెంబర్ 4 న తెలుగు సినిమా ప్రేమికులని చూసి ఇతర భాష ప్రేమికులు కుళ్ళుకునే పరిస్థితి. నాగ చైతన్య 'వృష కర్మ', నితిన్ 'అలియాస్ రుక్మిణి' వంటి భిన్న జోనర్స్ తో తెరకెక్కిన చిత్రాలు డిసెంబర్ 4 న సెల్యులాయిడ్ పై సాక్షాత్కరించడమే ప్రధాన కారణం. మరి ఆ చిత్రాలపై ఒక లుక్ వేద్దాం.

టాలీవుడ్‌లో ఒకే సమయంలో రెండు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటే.. వాటి మధ్య పోటీ కంటే ప్రేక్షకులకు దక్కే వినోదం గురించే ఎక్కువగా ఆలోచించాలి. ముఖ్యంగా రెండు సినిమాలు రెండు భిన్నమైన జానర్లలో తెరకెక్కితే ఆ అడ్వాంటేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వృషకర్మ, అలియాస్ రుక్మిణి సినిమాల విషయంలోనూ ఇదే ఆసక్తి కనిపిస్తోంది.

ఒకే తరహా కథలు, ఒకే తరహా ఎమోషన్స్‌తో సినిమాలు వస్తే ప్రేక్షకులకు కొంత మొనాటనీ అనిపించవచ్చు. కానీ ఒక సినిమా థ్రిల్, అడ్వెంచర్ వైపు తీసుకెళ్తే.. మరో సినిమా పూర్తిగా భిన్నమైన అనుభూతిని అందించవచ్చు. అందుకే ఈ రెండు సినిమాలని  బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా కాకుండా.. ప్రేక్షకులకు రెండు రకాల వినోదాన్ని అందించే చిత్రాలుగా చూడాలి.


నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో వస్తున్న వృషకర్మపై ఇప్పటికే ఆసక్తి పెరిగింది. విరూపాక్షతో సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను అద్భుతంగా తెరకెక్కించిన కార్తీక్.. ఈసారి పురాణాలు, ప్రాచీన రహస్యాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో కథను సిద్ధం చేశారు.

ట్రైలర్ చూస్తుంటే 5 వేల సంవత్సరాల నాటి రహస్యం, నిధి అన్వేషణ, భయంకరమైన శక్తులు, వాటిని ఎదుర్కొనే హీరో ప్రయాణం ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. నాగచైతన్య కూడా ఇంతకుముందు కంటే భిన్నమైన లుక్‌లో కనిపిస్తున్నారు. విజువల్స్, గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: కాకా తెలంగాణ రిలీజ్ హక్కులు ఈ సంస్థకే: ఎవరో తెలిస్తే ఎగిరి గంతేస్తారు! 

మరోవైపు  మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కిన అలియాస్ రుక్మిణి పూర్తిగా భిన్నమైన కథతో వస్తోంది. ఇందులో  కృష్ణ అనే క్యారక్టర్ లో నితిన్ కనిపిస్తున్నాడు. ఫ్యామిలీ కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తూ, రుక్మిణి అనే పేరుతో రహస్యంగా పుస్తకాలు రాసే వ్యక్తి రోల్ లో  కనిపించనున్నారు.

 

ఆ రహస్య రచనా ప్రపంచం ఆయన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సమస్యలకు దారితీసింది? పెళ్లి తర్వాత భార్యకు ఆ నిజం తెలియడంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనే ఆసక్తికరమైన అంశాలతో కథ సాగనున్నట్లు ట్రైలర్ చెబుతోంది. కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా కనిపిస్తోంది. నేచురల్  స్టార్ నాని సమర్పిస్తుండటం అలియాస్ రుక్మిణి స్పెషల్. 

పోటీ కంటే కంటెంట్ ముఖ్యం!
సాధారణంగా ఒకే రోజు రెండు సినిమాలు విడుదలవుతున్నాయంటే అభిమానుల్లో పోటీ మొదలవుతుంది. ఏ హీరో సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుంది? ఏ సినిమా హిట్ అవుతుంది? అనే చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ రెండు సినిమాల మధ్య జానర్ పరంగా స్పష్టమైన వ్యత్యాసం ఉంది.

వృషకర్మను ఇష్టపడేవారు మిస్టరీ, థ్రిల్లర్, ఫాంటసీ, అడ్వెంచర్ అంశాలను కోరుకుంటారు. అలియాస్ రుక్మిణి చూసేవారు ప్రేమ, నవ్వులు, కుటుంబ అనుబంధాలు, కొత్త తరహా కథనాన్ని ఆస్వాదించాలనుకుంటారు. అంటే ఒక సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు మరో సినిమాను కూడా చూసే అవకాశం ఉంది.

రెండు సినిమాలు హిట్ కావాలని కోరుకుందాం!
ఇండస్ట్రీలో ఒక సినిమా విజయం సాధిస్తే మరో సినిమా పరాజయం చెందాలనే పరిస్థితి ఉండకూడదు. ముఖ్యంగా కొత్త కథలు, భిన్నమైన జానర్లతో సినిమాలు చేయడానికి ముందుకొచ్చే దర్శక నిర్మాతలని ప్రేక్షకులు ప్రోత్సహించాలి. అప్పుడే తెలుగు సినిమా మరిన్ని ప్రయోగాలు చేయగలుగుతుంది. 

సినీ ప్రియులు కూడా అంత స్వార్ధ పరులేమి కాదు. ఐ మీన్..రెండు సినిమాలు బాగున్నా ఒక సినిమానే బాగుందని అనడానికి. రెండు సినిమాలు బాగుంటే ఎలాంటి పోలికలు తీసుకురాకుండా హిట్ చేస్తారు. కాబట్టి అభిమానులు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు. సినీ ప్రియులు స్వార్ధ పరులేమి కాదు. చాలా మంచి మనసు ఉన్న వాళ్ళు... ఎంజాయ్...

 

మీకు నచ్చవచ్చు 

చిరంజీవి, బాలకృష్ణ మల్టీస్టారర్‌కి కథ రెడీ: డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

ఎగతాళి చేసారు: ఇప్పుడు వరల్డ్ మొత్తాన్ని తన కామెడీతో నవ్విస్తున్నాడు!

 

[Vrushakarma, Alias Rukmini,Naga Chaitanya,Nithiin]


 

google-ad-img