TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

దేవర 50 డేస్ సెలబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ వీరాభిమాని  

Nov 15, 2024 2:27PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వన్ మాన్ షో దేవర(devara)పార్ట్ 1 సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదలై విశేష ప్రేక్షకాదరణని పొందిన విషయం తెలిసిందే. కలెక్షన్స్ పరంగా కూడా ఎన్టీఆర్(ntr)కెరీర్ లోనే వన్ అఫ్ ది బెస్ట్ మూవీ గా కూడా నిలిచింది కొరటాల శివ(koratala siva)దర్శకత్వంలో  తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించగా జాన్వీ కపూర్, శ్రీకాంత్,సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు.

ఇక దేవర మూవీ ఈ రోజుతో యాభై రోజులని పూర్తి చేసుకోనుంది.ఇందుకు సంబంధించిన వేడుకలు హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో ఘనంగా జరగనున్నాయి. అభిమానుల సమక్షంలో జరగనున్న ఈ వేడుకకు ప్రముఖ హీరో విశ్వక్ సేన్, ప్రముఖ నిర్మాతలు శిరీష్, నాగ వంశీ లు ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.ఎన్టీఆర్ కి విశ్వక్ సేన్(vishwak sen)వీరాభిమాని అనే విషయం అందరకి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా  విశ్వక్ ఏం మాట్లాడతాడనే ఆసక్తి  నెలకొని ఉంది.

 

 

google-ad-img