
అగ్ర హీరో విజయ్(VIjay)తమిళనాట తన టివికే పార్టీతో విజయ దుందుభి మోగించాడు. సింగిల్ గా మెజారిటీ రాకపోయినా కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తామని విజయ్ తండ్రి ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ చెప్పుకొస్తున్నారు. నిజానికి విజయ్ పార్టీ ప్రాంభించిన దగ్గరనుంచి ఈ రోజు ఉదయం ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు విజయ్ విజయం సాధిస్తాడని ఎవరు ఊహించలేదు. కానీ తమిళ ప్రజలు విజయ్ కి పట్టం కట్టారు. ఇందుకు ప్రధాన కారణాలు ఇవే అనే చర్చ సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతుంది. మరి ఆ వివరాలు చూద్దాం.
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)పొలిటికల్ పార్టీ స్థాపిస్తానని అనౌన్స్ చేసాడు. కానీ వయసు సహకరించదేమో అనే కారణం చెప్పి తప్పుకున్నాడు. కానీ ఆ ప్రకటనపై చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే కొంత మంది ఓటర్లు సినిమాల నుంచి వచ్చే నాయకుడు తమ రాతని మారుస్తాడనే నమ్మకంతో ఉన్నారు.తమిళులకి సినిమా అన్నా, హీరోలు అన్నా అంత పిచ్చి. కానీ రజినీ వెనక్కి వెళ్లి విజయ్ రావడంతో వాళ్లంతా విజయ్ వైపు చూసారు. చూడమంటే కాదు రియల్ హీరో అని కూడా ఫిక్స్ అయిపోయారు. అలాగే విజయ్ గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతు హీరో నచ్చితే సినిమా చూడచ్చు గాని ఓట్లు వేస్తామా అనే మాటలు మాట్లాడాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్ తో పాటు యువత, ఒక వర్గం ప్రజలు విజయ్ కి ఓట్లు గుద్దడంలో రాజీ పడకూడదని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే తమిళ రాజకీయాన్ని నడిపిస్తుందే సినిమా వాళ్ళు. ముఖ్యమంత్రిగా చేసుకుంటూ వస్తుందే సినిమా వాళ్ళని. ఈ చిన్న విషయాన్నీ ప్రకాష్ రాజ్ మర్చిపోయాడు. పైగా ప్రకాష్ రాజ్(Prakash Raj)పక్కా కన్నడ వ్యక్తి.. తమిళనాడు వ్యక్తికి తమిళ మీద ఉండే ప్రాంత, భాష పిచ్చి ప్రపంచంలో మరో ప్రాంతానికి ఉండవు. ఎంత పిచ్చి అంటే తమిళ వ్యక్తి, ప్రాంతం తప్ప కులం, మతం పని చెయ్యవు. అందుకే మా తమిళుడుపై నువ్వెంటి మాట్లాడేది, సినిమా అంటే మాకు ఎంత పిచ్చో తెలియదా అని ఓట్లు కుమ్మి పడేసారు. మరి వైపు డిఏంకే లో స్టాలిన్ తర్వాత తన కొడుకు ప్రముఖ హీరో ఉదయనిధి స్టాలిన్ మాత్రమే కనపడటం, మళ్ళీ స్టాలిన్ సిఏం అయితే ఉదయనిధిని సిఏం చేస్తాడనే న్యూస్ బాగా స్ప్రెడ్ కావడంతో ఒక వర్గం ప్రజలు ఛత్రపతి లోకి ప్రభాస్ డైలాగ్ 'వాడు పోతే వీడు, వీడు పోతే వీడమ్మా మొగుడు నా అని భావించి విజయ్ కి కుమ్మి పడేసారు.
also read: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్
ముఖ్యంగా తమిళనాట కంటిన్యూగా రెండు సార్లు ఒకే రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న సందర్భాలు చాలా చాలా తక్కువ. ప్రభుత్వ వ్యతిరేకత చాలా హై లెవల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మరో ప్రతిపక్ష పార్టీ అన్నాడిఎంకే పరిస్థితి గందర గోళం. డి ఏంకే కంటే ముందు అన్నాడిఎంకే అధికారంలో ఉంటే ఏం జరిగిందో చూసారు. పైగా ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్ లో అందరి కంటే విజయ్ కి పేస్ వాల్యూ ఎక్కువ. దీంతో విజయ్ కి సపోర్ట్ చేసే వారి సంఖ్య పెరిగింది. అన్నిటికంటే ప్రధానంగా తమిళనాట రాజకీయ పరంగా ఒక కొత్త శక్తికి స్పేస్ చాలా ఉంది. ఈ స్పేస్ ఉన్నపుడు ఇమిడియెట్ గా ఓటరు చంక ఎక్కాలి. ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలి అనే సామెత విజయ్ కి అర్ధమయ్యే ఓటరు చంక ఎక్కాడు. పైగా ఒట్టిగా ఎక్కలేదు. అదిరిపోయే మేనిఫెస్టోతో. నూతన వధువుకి 8 గ్రాముల బంగారం, ఖరీదైన చీర, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో అందుకే ఆశీర్వదించారానే చర్చలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.




.webp)
