Home

»

Latest News

విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్: ఆ రంగానికి సంబంధించిన 'టాప్ 10'జాబితాలో చోటు 

Oct 14, 2026 1:06PM


రణబాలి ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ స్పీడ్, కాన్ఫిడెన్స్ చూస్తుంటే హిట్ ని ఈ సారి  చాలా గట్టిగానే అందుకోబోతున్నాడా  అనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో, విజయ్, రష్మిక అభిమానుల్లో రణబాలి పండుగ వాతావరణం తీసుకొచ్చింది. 


ఇక విజయ్ దేవరకొండ  మరోసారి తన ఫ్యాషన్ స్టైల్‌తో నేషనల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచారు. ప్రముఖ వినోద, జీవనశైలి వేదిక 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' (THR India) విడుదల చేసిన అత్యంత ప్రతిష్టాత్మకమైన 'టాప్ 10 బెస్ట్ డ్రెస్డ్' (Top 10 Best Dressed Of The Year) సెలబ్రిటీల జాబితాలో విజయ్ దేవరకొండ స్థానం సంపాదించుకున్నారు. ఈ వార్త వెలువడిన క్షణం నుంచి సోషల్ మీడియాలో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ #VijayDeverakonda, #Ranabaali ట్రెండ్స్‌ను మోతెెక్కిస్తున్నారు. కేవలం సినిమాల పరంగానే కాకుండా, రియల్ లైఫ్‌లోనూ మరియు రెడ్ కార్పెట్ ఈవెంట్లలోనూ ఆయన ప్రదర్శించే సరికొత్త ఫ్యాషన్ ప్రయోగాలు, బోల్డ్ అండ్ క్లాసీ లుక్స్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎలాంటి దుస్తులైనా సరే తనదైన శైలిలో కాన్ఫిడెంట్‌గా క్యారీ చేయగలగడం విజయ్ ప్రత్యేకత అని ఫ్యాషన్ నిపుణులు ఎప్పుడూ ప్రశంసిస్తుంటారు.

ఇది కూడా చదవండి: Jailer 2: జైలర్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది: మరి రేపు థియేటర్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందో!

 

 

ఏది ఏమైనా 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' అందించిన ఈ లేటెస్ట్ ఫ్యాషన్ లిస్ట్‌లో విజయ్  చోటు దక్కించుకోవడం ద్వారా సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్‌లో మరో మెట్టు ఎక్కించారనే చెప్పాలి. 

 

vijay Deverakonda In ThrIndia Best Dressed, Vijay Deverakonda, THR India Best Dressed, Vijay Deverakonda style icon, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com