Home

»

Latest News

ఇదే చివరి చిత్రమా!

Oct 14, 2026 2:33PM

 

స్టార్ జోడి విజయ్ దేవరకొండ, రష్మిక ఇప్పుడు స్టార్ కపుల్స్ హోదాలో ఈ నెల 16 న 'రణబాలి'తో సెల్యులాయిడ్ పై ల్యాండ్ కానున్నారు. దీంతో ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో 'రణబాలి' పై ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. పైగా భార్య భర్తలైన తర్వాత స్క్రీన్ పై మెరవనుండటంతో ఆ ఇద్దరు ఎలా మెస్మరైజ్ చేయబోతున్నారనే క్యూరియాసిటీ కూడా రెట్టింపయ్యిందని చెప్పవచ్చు.  

అయితే సోషల్ మీడియాలో ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన ప్రచారం జోరుగా సాగుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటిస్తున్న 'రణబాలి' చిత్రమే వారిద్దరి కలయికలో రాబోయే ఆఖరి సినిమా అవుతుందంటూ వస్తున్న వార్తలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ రూమర్స్ వెనుక అసలు నిజం ఏమిటనే దానిపై సినీ విశ్లేషకులు స్పందిస్తూ, ఇందులో ఎలాంటి అధికారిక స్పష్టత లేదని తేల్చిచెప్పారు. వ్యక్తిగత జీవితంలోనూ ఒకటైన ఈ తారలు, తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో ఎప్పుడూ మ్యాజిక్ చేస్తూనే ఉన్నారు. అయితే, ఇది వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఆఖరి సినిమా అని ప్రచారం జరగడానికి ప్రధాన కారణం, ఈ ప్రాజెక్ట్ తర్వాత వీరిద్దరూ సోలో ప్రాజెక్ట్స్‌పై లేదా వేర్వేరు డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటమే కావచ్చునని సమాచారం. 


ఇది చదవండి: విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్: ఆ రంగానికి సంబంధించిన 'టాప్ 10 'జాబితాలో చోటు 

 

 

కాబట్టి ‘రణబాలి’ తర్వాత వారు మళ్లీ కలిసి నటిస్తారా లేదా అనేది పూర్తిగా భవిష్యత్తు స్క్రిప్ట్‌లు, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది తప్ప, రణబాలి ఖచ్చితంగా ఆఖరి సినిమా అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. విజయ్ దేవరకొండ అత్యంత ఉద్వేగభరితమైన యోధుడిగా రణాబాలి రోల్ లో  కనిపిస్తుండగా, రష్మిక జయమ్మగా శక్తివంతమైన రోల్‌ పోషిస్తున్నారు. పాన్ ఇండియా బ్యానర్  మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ నిర్మించగా రాహుల్ సంక్రుత్యియన్ దర్శకుడు.  

 

 

[vijay Deverakonda And Rashmika Ranabaali last Movie Truth, Vijay Deverakonda, Rashmika Mandanna, Ranabhali movie, 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com