Home

»

Latest News

పుట్టపర్తిలో విజయ్‌ దేవరకొండ, రష్మిక: వైరల్ విశేషాలు ఇవే!

Oct 15, 2026 4:46PM


మరికొన్ని గంటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక సెల్యులాయిడ్ 'రణబాలి' తో ప్రత్యక్షం కానున్నారు. ఇండియాకి స్వాతంత్య్రం రానప్పుడు రాయలసీమలో బ్రిటిష్ వాళ్లపై తిరగబడిన ఒక వీరుడి నిజ జీవిత  కథ కావడంతో అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


  ఇది కూడా చదవండి: ఆ విషయంలో తప్పు మాదే: అసలు నిజం చెప్పేసిన హీరో!


కాసేపటి క్రితం  విజయ్‌ దేవరకొండ, రష్మిక  ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పుట్టపర్తికి చేరుకున్నారు. శ్రీ సత్యసాయిబాబా దివ్య సన్నిధి అయిన ప్రశాంతి నిలయంలో  బాబా మహా సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ జంట ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ సినిమాలతో, షూటింగ్ బిజీతో గడిపే ఈ రూమర్డ్ కపుల్, ఆధ్యాత్మిక ప్రదేశానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

 

ప్రశాంతి నిలయంలో వీరిద్దరూ కలిసి అడుగుపెట్టడం, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణంలో గడపడం చూసిన స్థానికులు మరియు అభిమానులు ఎంతో ఆశ్చర్యపోయారు.బాబా సమాధిని దర్శించుకున్న అనంతరం వారు అక్కడ కొన్ని నిమిషాలు ప్రశాంతంగా గడిపినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో, అభిమానులు షేర్ చేయడంలో బిజీగా ఉన్నారు.

 

[vijay Deverakonda And Rashmika Puttaparthi visit, Vijay Deverakonda, Rashmika Mandanna, Puttaparthi,Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com